పెసరట్టు పిండి: రెండు కప్పులు
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు: అయిదారు
పంచదార: 1 టేబుల్ స్పూన్
ఈనో ఫ్రూట్ సాల్ట్: 1 ప్యాకెట్
నూనె: 1 టేబుల్ స్పూన్
నువ్వులు: అర టేబుల్ స్పూన్
ఆవాలు: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: నాలుగు రెబ్బలు
ఉప్పు: రుచికి తగినంత
ముందుగా అల్లాన్ని సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరప కాయల్ని పేస్ట్‌లా చేసుకోవాలి. వీటితోపాటు కొంచెం ఉప్పు, ఈనో సాల్ట్, పంచదారను పెసరట్టు పిండికి జోడించి బాగా కలపాలి. తర్వాత ఒక గిన్నెలో వేడినీళ్లు పోసుకుని ఆవిరి కుడుములు వేసినట్టు ఈ పిండితో కుడుములా వేయాలి. లేదా ఇడ్లీ ప్లేట్లకు కాస్త నెయ్యి రాసి ఈ పిండితో ఇడ్లీల్లా వేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి నువ్వులు, ఆవాలు, కరివేపాకు పోపు పెట్టి చిటపటలాడగానే అందులో ఈ ముక్కలు వేసి కలిపి పొయ్యి ఆపేయాలి. ఇంకేం, తెలుగు స్టయిల్లో గుజరాతీ వంటకం ఢోక్లా రెడీ!
– ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు