వినాయకునికి గరికపూజ ప్రీతి. కింది నామాలను చదువుతూ ఒక్కో నామానికి రెండు గరికలను స్వామివారికి సమర్పించండి.
ఓం గణాధిపాయ నమః- దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమారగురవే నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః – దూర్వాయుగ్మం పూజయామి
మంత్రపుష్పం
అక్షతలు చేతిలో ఉంచుకుని కింది శ్లోకాన్ని చదవండి…
తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
చేతిలోని పూలు, అక్షతలు స్వామివారిపై ఉంచాలి.
ప్రదక్షిణం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః
ఆత్మ ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి.
పునః అర్ఘ్యం
పుష్పంతో నీళ్లు సమర్పించాలి.
అర్ఘ్యం గృహాణ హేరంబ
సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన
పువ్వులు, అక్షతలు తీసుకోవాలి.
కింది శ్లోకాన్ని చదివి గణనాథుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి.
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్న
నాశకఈప్సితంమే వరందేహి పరిత్ర చ పరాంగితమ్
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశా
పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్
సమర్పయామి
అక్షింతలు స్వామివారి పాదాల వద్ద వేయండి. ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, ఆందోళికానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.
చేతిలో అక్షతలు తీసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని కింది శ్లోకాన్ని చదివాక ఒక పళ్లెంలో వదలాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ అష్టోత్తర శతనామార్చనాయచ, అవసర, మహానివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
చివరగా స్వామివారి ముందున్న పూజాక్షతలను పెద్దలు తమ శిరస్సుపై వేసుకొని, కుటుంబసభ్యులందరిపై వేయాలి. తర్వాత చేతిలో అక్షతలు ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి..