Vidyut Jamwal Favorite Food | రీల్ విలన్‌గా పేరుగాంచినా, రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నాడు విద్యుత్ జమ్వాల్. పేరుకు పెద్ద నటుడే అయినా అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే విలక్షణ స్వభావం తనది. సోషల్ మీడియాలో విద్యుత్ ఫాలోవర్స్ సంఖ్య మిలియన్లలో ఉంటుంది.
వయసు నాలుగు పదుల్లో ఉన్నా కసరత్తులతో చాలెంజ్‌లు విసురుతూ కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోడానికి వ్యాయామం చేస్తూనే నచ్చినవన్నీ లాగించేస్తాడట. ముఖ్యంగా వర్షాకాలంలో షడ్రుచుల మిళితంగా తయారయ్యే భేల్‌పూరీ తినేందుకు ఇష్టపడతాడట. తినడమే కాదు, భేల్పూరీని తయారు చేయడమెలాగో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోనూ పంచుకున్నాడు ఈ ట్రెండీ యాక్టర్.
“మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న సినీ శెట్టి ఏ ఫుడ్ తీసుకుంటుందో తెలుసా !!”