ఆస్ట్రేలియాలో వైరలవుతున్న భేల్‌పూరీ.. ఎందుకంటే..
Bhel Puri | పాశ్చాత్యులకు మన భేల్‌పూరీ రుచి భలేగా నచ్చింది. ఆస్ట్రేలియా మాస్టర్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు ఆదమరచి ఆరగించారు. ఆ కథేమిటో మీరే చదవండి..
మరమరాలు, సేవ్, పచ్చి ఉల్లిపాయ, టమాట ముక్కలు, నోరూరించే చాట్ మసాలా, ఉప్పు, కారంతోపాటు ఫైనల్ టచ్‌గా జోడించే నిమ్మరసం, కొత్తిమీర తురుముతో కూడిన కలర్‌ఫుల్ చాట్.. భేల్‌పూరీ. చాలా చోట్ల సాయంకాలం కాగానే వీధుల్లో భేల్‌పూరీ బండ్లే కనిపిస్తాయి. అన్నట్టు, మన భేల్‌పూరీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది. ఎందుకంటే ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా ( Master Chef Australia )’ వంటల పోటీ కార్యక్రమంలో సారా టాడ్ ( Sara Todd ) అనే షెఫ్ పది నిమిషాల చాలెంజ్‌లో భాగంగా మంటతో పనిలేని మన భేల్పూరీని తయారుచేసి జడ్జీలకు వడ్డించింది. ఆ రుచిని చూసి జడ్జీలు తెగ మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలను ప్రత్యాశ రథ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా రీట్వీట్లు, కామెంట్లు, లైకులతో వైరలయ్యింది. అంతేకాదు చాలామంది సారాకు ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట. కొందరు నెటిజన్లు ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్లు, చాట్ సెంటర్ల లొకేషన్లు షేర్ చేసి ఓసారి రుచి చూడమని సిఫారసు చేశారు. అదీ మరి మన భేల్‌పూరీ ఘనత. నిజానికి ఇది ఉత్తరాది రుచే అయినా.. దక్షిణాది ప్రజల అభిరుచికీ దగ్గరగా ఉంటుంది.. కారంకారంగా!
Read More :
Fanta Noodles | నీళ్లతో కాకుండా ఫాంటాతో చేసే నూడిల్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Food
- master chef
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

