Platform 65 Train Restaurant | రైల్లో తినడం మామూలే కానీ, ఏకంగా రైలే వచ్చి.. ఆహారాన్ని అందించే వింతైన భోజనం ఆస్వాదించాలంటే మాత్రం హైదరాబాద్ కూకట్పల్లిలోని ‘ప్లాట్ఫామ్-65’కు వెళ్లాల్సిందే. థీమ్ బేస్డ్ రెస్టారెంట్లకు పెరుగుతున్న ఆదరణకు ఇదో సాక్ష్యం. ఇక్కడ టేబుళ్లు, కుర్చీలు.. రైలు సీట్లను తలపిస్తాయి.
వరంగల్, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి గమ్యస్థానాలను స్టేషన్ పేర్లతో సహా రూపొందించారు. ఆయా మార్గాల్లోని పట్టణాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలను కూడా గోడలపై పెయింట్ చేశారు. దీంతో నచ్చిన మార్గాన్ని ఎంచుకుని.. కూర్చోవచ్చు. వడ్డన విషయానికొస్తే ఈ రెస్టారెంట్లో సర్వర్లకు బదులు బుల్లిబుల్లి ట్రైన్లు మనం ఆర్డర్ చేసిన వెరైటీలను తెచ్చి ఇస్తాయి. ఆ అనుభూతిని ఆస్వాదించాలంటే ప్లాట్ఫామ్–65కు వెళ్లాల్సిందే. ఇద్దరికి రూ.1,000 వరకూ చార్జ్ చేస్తారు.
Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి”
“Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!”