Lavanya Tripathi Favorite Food | వానకాలంలో వేడివేడి చిరుతిళ్లు లాగించడం అందరికీ ఇష్టమే. చల్లని వాతావరణంలో నోరూరించే ఫలహారం భలేగా అనిపిస్తుంది. సాయంకాలపు చిరుతిళ్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది వేడివేడి బజ్జీలే. ఈ విషయంలో సెలెబ్రిటీలూ అతీతం కాదు. చిరు చినుకులు కురుస్తుంటే అల్లం టీతోపాటు వేడివేడి బజ్జీలు ఆరగించడం అంటే తనకూ ఇష్టమంటున్నది లావణ్య త్రిపాఠి.
‘వర్షాకాలంలో వేడివేడి స్నాక్స్ ఇష్టపడతా. అందులోనూ బజ్జీలంటే భలే ఇష్టం. ఇదీ, అదీ అనే తేడా లేదు. మిర్చి, ఆలూ, ఉల్లి, వంకాయ.. అన్నిరకాల బజ్జీలనూ ఇష్టంగా తింటాను. కాకపోతే వేడివేడిగా అల్లం టీ కాంబినేషన్ ఉండాల్సిందే’ అంటూ తన ఇష్టాన్ని పంచుకుంటున్నది లావణ్య.
“Lavanya Tripathi | మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి..”