ఇటీవల తమిళనాడులో లావణ్య అనే 17 ఏళ్ల బాలిక (Lavanya death) మృతి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లావణ్య ఆత్మహత్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడంపై చర్చకు తెరలేసింది. అయితే కొందరు నెటిజన్లు ఈ టాపిక్‌ను చర్చిస్తూ..#lavanyatripathi అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు. కార్తీక్ అగర్వాల్ అనే నెటిజన్ చేసిన కామెంట్స్ నెట్టింట హీట్ పెంచాయి.
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కేవలం ఒక నటి మాత్రమే..ధర్మం కోసం ఆమె ఎలాంటి త్యాగాలు చేయలేదు. బాధితురాలు లావణ్యను ఛీప్ నటీమణులతో పోల్చవద్దని కార్తీక్ అగర్వాల్ ఘాటైన కామెంట్ చేశాడు. అయితే తనను ‘ఛీప్ నటి’గా అభివర్ణిస్తూ వాడిన అభ్యంతరకర పదజాలంపై లావణ్య త్రిపాఠి అప్ సెట్ అయ్యింది.
Why do men like you start respecting women when something horrible happens, before that they call them cheap.. Learn to respect everyone!
— LAVANYA (@Itslavanya) January 31, 2022
Extremely unfortunate incident, but this is the reality of our society. https://t.co/nGVshvWeCk
ట్రోల్స్ పై లావణ్య త్రిపాఠి కోపంగా రియాక్ట్ అవుతూ..కేవలం మహిళ, అమ్మాయి బాధితురాలు అయినప్పుడు మాత్రమే కాకుండా..అన్ని సమయాల్లో మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఏదో ఒక భయంకరమైన ఘటన జరిగినప్పుడు మాత్రమే స్త్రీలను పురుషులు గౌరవిస్తారెందుకని..? ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. కానీ మన సమాజంలో ఉన్న రియాలిటీ ఇదేనంటూ ట్రోల్స్ కు ఘాటుగా స్పందించింది.