‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం షురూ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ (Tollywood) భామ లావణ్య త్రిపాఠి (lavanya tripathi) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday) టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ (Happy Birthday Look) ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తోంది. చిత్ర టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతోంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులకు మంచి పార్టీ రెడీ అవుతుందనేలా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘మా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె పుట్టినరోజున ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ రానా ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మంచి తారాగణం కుదిరింది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ (Kalabhairava) సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
Presenting the Title & First Look of Pan Telugu Film
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2021
Prod No. 3 of @ClapEntrtmnt is titled 'HAPPY BIRTHDAY'
It's a HAPPY BIRTHDAY for @Itslavanya 🎉#HBDLavanyaTripathi @RiteshRana #NareshAgastya #Satya @vennelakishore @kaalabhairava7 @sureshsarangam @MythriOfficial pic.twitter.com/rl3s2uvZQi
లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కేవీవీ
సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్; సమర్పణ: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి;
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రితేష్ రానా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో