బంగార్రాజు సినిమాలో లావణ్య త్రిపాఠి నటించకపోవడానికి రీజన్ ఇదేనంట !!
నాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రంలో హ్యాపీ పాత్రలో కనిపించనుందీ తార. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Lavanya Tripathi Interview | నాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రంలో హ్యాపీ పాత్రలో కనిపించనుందీ తార. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నాయిక లావణ్య త్రిపాఠి.
తొలిసారి యాక్షన్ సినిమాలో నటించిన అనుభవం ఎలా ఉంది?
ఈ తరహా సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర, సినిమా నేపథ్యం, మేకింగ్‌లో ఉపయోగించిన టెక్నాలజీ అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ చిత్రంలో నటించడాన్ని ఆస్వాదించాను. జిమ్‌లో కిక్ బాక్సింగ్ లాంటివి చేస్తుంటా. కానీ తెరపై యాక్షన్ చేయడం ఇదే తొలిసారి.
సినిమాలో మీ బర్త్‌డే రోజు ఏం జరుగుతుంది?
ఈ చిత్రంలో నాపేరు హ్యాపీ. నా బర్త్ డే రోజున కథ జరుగుతుంది. వేర్వేరు పాత్రలు, వేర్వేరు సందర్భాలతో సినిమా సాగుతుంది. ఐదేళ్ల నుంచి ఒక రోజుకు సాగే జర్నీగా ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశమేమిటి?
ఈ లైన్ చెప్పినప్పుడు ఐడియా బాగా నచ్చింది. కాల్పనిక ప్రపంచంలో కథ జరుగుతుంది. నా పాత్ర ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. లాక్డౌన్ తర్వాత ఓటీటీల్లో విభిన్న తరహా చిత్రాలు వచ్చాయి. సినిమాల్లోనూ ఆ తరహా కంటెంట్ కావాలనిపించింది. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యం ఉంటుంది. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు అదొక ముఖ్య కారణం.
గన్ కల్చర్‌ను చూపించే సినిమా అనుకోవచ్చా?
మన దగ్గర అలాంటి సంప్రదాయం రావాలని కోరుకోవడం లేదు. వినోదాత్మక కథలో గన్ వాడకం చూపిస్తున్నాం. ‘కేజీఎఫ్’లో ఎంత పెద్ద గన్స్ వాడారో చూశాం కదా. ఇందులో గన్ వాడకాన్ని మేము ఎక్కడా ప్రోత్సహించలేదు.
నవ్వించే పాత్రలో నటించడం కష్టమైందా?
నా మొదటి సినిమా నుంచి నేను సీరియస్‌గా ఉంటాననే ఇమేజ్ వచ్చింది కానీ నేను చాలా ఫన్ పర్సన్‌ని. ప్రతి క్షణం ఏదో జోక్ వేసి పక్కవాళ్లను నవ్విస్తుంటా. అలాంటి వాతావరణమే నా చూట్టూ ఉండాలని కోరుకుంటా. ఈ సినిమాలో కామెడీ చేయడం కష్టమే కాలేదు. ఎందుకంటే నా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో సీరియస్ పాత్రలో నటించా. ఇందులో హ్యూమర్ క్యారెక్టర్ చేయడం నాకు రిలీఫ్ ఇచ్చింది.
ఒక నాయికగా మీరే సినిమాను నడిపించడం ఎలా అనిపించింది?
ఒక ఇంటర్వూలో నన్ను చూసి ఈ పాత్ర రాశానని దర్శకుడు రితేష్ రానా చెప్పాడు. నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’లో నా పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. నా క్యారెక్టర్ కథను లీడ్ చేస్తుంది. పదేళ్ల తర్వాత మళ్లీ నాకు ఈ చిత్రంతో అలాంటి అవకాశం దక్కింది. పూర్తి కమర్షియల్ చిత్రంలో ఇలాంటి పాత్ర దొరకడం అరుదు. నేను నటించగలను అని దర్శకుడు నమ్మాడు. ఆయన నమ్మకం నుంచే నాకు ఆత్మవిశ్వాసం మొదలైంది.
దర్శకుడు రితేష్ రానా ప్రతిభ గురించి చెప్పండి?
ఈ కథలో నాకు కొన్ని అంశాలు చాలా కొత్తగా అనిపించాయి. ఆయన బాగా తెరకెక్కిస్తాడని నమ్మాను. సర్రియల్ వరల్డ్‌లో ఏదైనా జరుగొచ్చు. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనిపించదు. ఎందుకంటే అదొక కాల్పనిక ప్రపంచం.
మీకు ఇప్పటిదాకా కష్టమనిపించిన పాత్ర ఏది?
నా మొదటి చిత్రం ‘అందాల రాక్షసి’లో నటించిన తర్వాత ఇక ఏ సినిమాలోనూ నటించడం కష్టమనిపించలేదు. ఎందుకంటే నా తొలి చిత్రంలోనే చాలా బాధ్యత గల క్యారెక్టర్ చేశాను. ఎలా నటించాలో తెలుసుకున్నాను. ఆ సినిమాకు పడిన శ్రమతో చూస్తే మిగతావన్నీ కేక్ వాక్లే. ఈ సినిమాలో దాదాపు పది కిలోల బరువైన గన్స్ పట్టుకోవడం ఒక్కటే కష్టమనిపించింది.
నాయికగా మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా?
నాకొచ్చే అవకాశాలు, లభిస్తున్న క్యారెక్టర్స్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. కష్టపడి సినిమా చేయడమే నాకు తెలుసు. దాని ఫలితం నా చేతుల్లో లేదు. మొదట్లో ఇతర నాయికల గురించి ఆలోచించేదాన్ని కానీ కొంత అనుభవం వచ్చాక ఇంకొకరు ఏం చేస్తున్నారు, ఎంత స్థాయికి వెళ్లారు అనేది నేను ఆలోచించడం మానేశాను. నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తే చాలనుకుంటా.
‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ బంగార్రాజులో నటించలేదు ఎందుకని?
‘సోగ్గాడే..’లో నాది నాగార్జున భార్య పాత్ర. అలా చూస్తే ‘బంగార్రాజు’లో నాగ చైతన్యకు తల్లిగా నటించాలి. ‘బంగార్రాజు’ షూటింగ్ టైమ్‌లో నాగార్జున ఫోన్ చేసి లావణ్య..నిన్ను చైతూకు తల్లిగా చూపించలేము. అందుకే ఈ మూవీలో తీసుకోవట్లేదు అని చెప్పారు. నేను థాంక్స్ సార్ అన్నా.
పెళ్లి సంగతులు చెబుతారా
ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా చేతికున్న ఉంగరం నేను కొనుక్కున్నదే. కొంతకాలం కెరీర్ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా.
ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమాల గురించి
ఈ సినిమా తర్వాత నాకు అన్నీ యాక్షన్ సినిమాలే వస్తాయని అనుకుంటున్నాను. తమిళంలో అధర్వ సరసన ఒక సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో ఒక ప్రాజెక్ట్ ఉంది. వెబ్ సిరీస్‌లకూ సంప్రదింపులు జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

