వంట ఎంతగొప్పగా ఉన్నా.. కొంచెమైనా ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. మనం రోజువారీగా వాడే ఉప్పు బాగా ప్రాసెస్ చేసింది. పైగా దీనిలో మినరల్స్ కూడా ఉండవు. కానీ సెల్టిక్ సీ సాల్ట్‌లో మాత్రం మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్నే గ్రే సాల్ట్ అని కూడా పిలుస్తారు. చూడటానికి మామూలు రాళ్లుప్పులా కనిపించినా సెల్టిక్ సీ సాల్ట్ వేరు. దీన్ని చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు.
సెల్టిక్ సీ సాల్ట్ ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, దీన్ని అందరూ వాడకూడదు. ఎవరు వాడొచ్చంటే..
టేబుల్ సాల్ట్‌ను బాగా రీఫైన్ చేస్తారు. దీంతో ఉప్పులో సహజంగా ఉండే మినరల్స్ చాలావరకు తొలగిపోతాయి. అదనంగా ఉప్పు గడ్డకట్టకుండా యాంటి కేక్ ఏజెంట్స్, అయోడిన్ లాంటివి కలుపుతారు. సెల్టిక్ సీ ఉప్పును సముద్రపు నీటి నుంచి సహజంగా పండిస్తారు. సూర్యరశ్మిలో పొడిబారేలా చేస్తారు. ప్రాసెసింగ్ మితంగా ఉంటుంది. కాబటి,్ట సహజ గుణాలు అలానే ఉండిపోతాయి.
మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ లాంటి 80 అత్యవసర మినరల్స్ సెల్టిక్ సీ సాల్ట్‌లో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉండటానికి, కండరాల పనితీరు, ఆరోగ్యం సవ్యంగా సాగడానికి దోహదపడతాయి.
సెల్టిక్ సీ సాల్ట్‌లో ఉండే సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహకరిస్తాయి. అలసట, కండరాలు పట్టేయడం, డీహైడ్రేషన్‌తో బాధపడేవారికి ఈ ఉప్పు మేలుచేస్తుంది. తాగే నీటికి చిటికెడు సెల్టిక్ సీ సాల్ట్ కలుపుకొంటే శరీరంలో హైడ్రేషన్ స్థాయి పెరుగుతుంది.
సెల్టిక్ సీ సాల్ట్ జీర్ణవ్యవస్థలో ఎంజైములను ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం తేలిగ్గా విచ్ఛిన్నమైపోతుంది. అంతేకాదు ఇది పొట్టలో ఆమ్లాల స్థాయిని సమతూకంలో ఉంచుతుంది. కడుపుబ్బరం నుంచి ఉపశమనం ఇస్తుంది.