పి.ఎస్.శ్రీధరన్ పిైళ్లె ప్రస్తుతం గోవా రాష్ట్ర గవర్నర్. అంతకుముందు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పిైళ్లె మంచి రచయిత కూడా. ఆయన కలం నుంచి తాజాగా జాలువారిన 150వ పుస్తకాన్ని ఎల్.ఆర్.స్వామి ‘రామచిలుక’ పేరుతో తెలుగు అనువాదం చేశారు. ఇందులో మొత్తం ఏడు కథలు ఉన్నాయి. ‘రామచిలుక’ కథ గోవా రాజ్‌భవన్ నేపథ్యంలో కథకుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. కథకుడు రామచిలుకను ఊహించుకుని తాను పసివాడైపోయి సాంత్వన పొందే ఈ ఫాంటసీ కథ నిజంగానే మన గుండెను తాకుతుంది. ‘చేప చిక్కాలంటే’ కథ స్మార్ట్ఫోన్లలో చిక్కుకుని విలవిల్లాడుతున్న బాల్యాన్ని పిల్లలకు ఎలా తిరిగి ఇవ్వగలమో వెల్లడిస్తుంది.
మరో కథ ‘సాయం సంధ్య’ మారుతున్న భారతీయ కుటుంబ విలువల గురించి ఆర్ద్రంగా వివరిస్తుంది. మనిషికి, పశువుకు పెనవేసుకున్న బంధం విలువ ప్రాణానికి సమానమని చాటుతుంది. ‘ఆత్మఛాయ’ కథ పిల్లచేష్టలు ఎలా ఉంటాయో తెలుపుతుంది. పిల్లలు తెలిసీ తెలియక దొంగతనం చేస్తే ఎలా మన్నించాలో మార్గం సూచిస్తుంది. పెద్దలు కూడా ఒకప్పుడు పిల్లలే కాబట్టి, రచయిత దీనికి ‘ఆత్మఛాయ’ పేరు ఎంచుకున్నారు. గూడమన అనే ఆచారం నేపథ్యంలో సాగే ‘స్త్రీ నైజం’ కథ ఓ గిరిజన బాలిక పెద్దమనిషి అయ్యాక ఆమె మానసిక సంఘర్షణను వివరిస్తుంది. ‘గాయం’ కథ మలయాళీల ఇండ్లలో సర్పకావు సంప్రదాయం చుట్టూ తిరుగుతుంది. ‘న్యాయం’ కథ అకారణంగా ఎవరినీ శిక్షించకూడదనే సందేశాన్ని ఇస్తుంది. ముందుమాటలో అబ్రాహిం మాథ్యూ చెప్పినట్టు ‘రామచిలుక’ కథలు చదువుతుంటే ఒంటరైన ఆత్మ తాలూకు వేదన, సానుభూతి, హృదయ బంధాల బాధలు అనుభవంలోకి వస్తాయి.
రచన: పి.ఎస్.శ్రీధరన్ పిైళ్లె
అనువాదం: ఎల్.ఆర్.స్వామి
పేజీలు: 104; ధర: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 98487 87284
రచన: వీరవల్లి విజయా రంగనాథం
పేజీలు: 194;
ధర: రూ. 200
ప్రచురణ: తపస్వి మనోహరం పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 91772 21007
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 140;
ధర: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 98487 87284