తన సమకాలీన ప్రమాణాలకు అతీతంగా ఎదిగే ఉన్నతుడే గొప్ప వ్యక్తి అని ఓ చరిత్రకారుడు ప్రతిపాదించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అలాంటి లక్షణాలు కలిగిన మహోన్నత మానవతా మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స). అనాథగా జీవితాన్ని ప్రారంభించి.. బహిష్కృత శరణార్థిగా కొనసాగి& స్వయం కృషి, సాధనతో ఆధ్యాత్మిక, భౌతిక రాజ్యాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మహనీయుడు ఆయన. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రపంచం పెట్టిన అగ్నిపరీక్షలో నెగ్గారు.
తాను నిరక్షరాస్యుడైనా… జీవితానుభవంతో, ఆధ్యాత్మిక సాధనతో ధార్మిక గురువుగా, సమర్థ పాలకుడిగా, తత్వవేత్తగా ఎదిగారు. మానవ జీవితంలో అన్ని రంగాల్లో ఆయన విశేష కృషి చేసి మానవాళికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఆయన యుద్ధక్షేత్రంలో ఆరాధన చేయడం నేర్పారు. అరబ్బులను మానవీయులుగా మార్చారు. అథః పాతాళంలో ఉన్న వారిని నాగరికత, విజ్ఞానానికి సారథులుగా మార్చగలిగారు. అధికారం చేతిలో ఉన్నా నిరాడంబరంగా జీవించి పాలకులకు ఆదర్శంగా నిలిచారు.
స్వల్ప సాధనాలతో గొప్పదైన లక్ష్యాన్ని సాధించిన ఆయన అసమాన మానవ ప్రతిభను, ఔన్నత్యాన్ని ఆధునిక ప్రపంచంలో మరే గొప్ప వ్యక్తితోనూ పోల్చలేం! మనుషుల్లో మానవత్వాన్ని పాదుగొల్పడమే ధ్యేయంగా జీవించి తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన ఆచరించి చూపిన మార్గం ఇస్లాం ధర్మం, ఖురాన్లో నిక్షిప్తమై నేటికీ మానవాళికి మార్గనిర్దేశం చేస్తున్నది. ఆయన జీవిత విశేషాలను, సందేశాన్ని మరింతగా తెలుసుకోవాలంటే ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుస్తకం చదవాల్సిందే.
రచన : ప్రొ॥కె.యస్.రామకృష్ణారావు
పేజీలు: 40, ధర: ఉచితం ప్రతులకు సంప్రదించాల్సిన
ఫోన్: 040-45723000, 1800 572 3000
రచన: టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి
పేజీలు: 120;
ధర: రూ. 160
ప్రచురణ: కళా ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 93472 98942
రచన: విహారి
పేజీలు: 152;
ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 98480 25600
రచన: లక్ష్మణ్‌రావు పతంగే
పేజీలు: 62;
ధర: రూ. 60
ప్రతులకు:92900 79047