ప్రముఖ రచయిత సింహప్రసాద్ వెలువరించిన ‘బతకాలి ’ కథా సంపుటిలోని ప్రతి కథా ఆలోచింపచేసేదే! ఈ కథలు వస్తుపరంగా భిన్నంగా ఉండటం గమనార్హం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రికి వివాహిత కూతురు కిడ్నీ ఇవ్వకూడదట. అది రూలు. ఇవ్వాలంటే భర్త అనుమతి తప్పనిసరట. ‘పెళ్లయినంత మాత్రాన నా శరీరం మీద, నా దేహభాగాల మీద నాకు హక్కులుండవా?’ అని వాపోయిన సదరు కూతురు కోర్టులో పోరాడి అనుకూలంగా తీర్పు పొందుతుంది.
ఇదే విషయంలో భర్తకు ఎవరి అనుమతి అవసరం లేదు, ఎవరికైనా అవయవ దానం చేయవచ్చు. ఈ వివక్షనే ప్రశ్నిస్తుంది ‘హక్కు’ కథలోని నాయిక. జాలర్లను వేధిస్తున్న అధికారులకు బుద్ధి చెప్పడానికి ఒక జమీందారిణి గంగానదిలో 10 మైళ్లు కొని తెల్లదొరలకు చుక్కలు చూపిస్తుంది ‘సంకెళ్లు’ కథలో! ప్రేమపేరుతో అపరిపక్వ మనసులతో ఏకమవుదాం అనుకున్న యువతకు చక్కని పాఠం చెబుతాడు ‘ప్రేమికులు’ కథలో రచయిత. సమకాలీన ప్రపంచంలో ఎదురవుతున్న సమస్యల చుట్టూ అల్లిన కథలివి.
సమస్యలతోపాటు పరిష్కారాలను కూడా రచయిత సూచించడం బాగుంది. ఆధునిక సమాజంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో తిండికి స్విగ్గీలు జొమాటోలపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంగా అల్లిన ‘కిక్ ది కిచెన్’ కథ నేటి సమాజంలోని ఒక ప్రధాన సమస్యను వ్యంగ్యంగా మన ముందుకు తెస్తుంది. కళ్లు తెరిపిస్తుంది. ఈ సంపుటిలోని 18 కథలు వేటికవే ప్రత్యేకమైనవి. అందరూ చదవాల్సిన కథలు.
రచన: సింహ ప్రసాద్
పేజీలు: 184; ధర: రూ. 150
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, నవోదయ బుక్ హౌస్
ఫోన్: 98490 61668
రచన: విల్సన్రావు కొమ్మవరపు
పేజీలు: 182;
ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 89854 35515
రచన: బి. మురళీధర్
పేజీలు: 206,
ధర: రూ. 200
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
రచన: గడ్డం సులోచన
పేజీలు: 77;
ధర: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 92463 64927