‘వినదగునెవ్వరు చెప్పిన.. వినినంతనే వేగపడక..’ అని సుమతీ శతకం చెప్తుంది. ఎవరు చెప్పినా వినాలని, అంతేకాకుండా మంచిచెడ్డలు కూడా విచారించాలని ఆ పద్యం అంతరార్థం. మనుషుల మధ్య బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తించి అలా చెప్పారన్న మాట. వినడం సరిగ్గా జరగక పోతే మనుషుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. బంధాలు బలహీనపడతాయి. అనుబంధాలు అటకెక్కుతాయి. సరిగ్గా వినకపోవడం అనేది ఒక్కోసారి వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచే ప్రమాదం ఉంది. సామాజిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.
వినడం కేవలం కమ్యూనికేషన్లో ఒక భాగం కాదు. ఇంకా పెద్ద పాత్రే దానిది. ఒక మంచి సంభాషణ ప్రారంభమయ్యేది మంచి శ్రోత ఉన్నప్పుడే. ఇద్దరు మనుషుల మధ్య పరిచయాన్ని అనుబంధంగా మార్చే శక్తి కేవలం వినే ప్రక్రియకే ఉంది. ఎవరైనా చెప్పేది శ్రద్ధగా వింటున్నారు అంటే వారిపట్ల గౌరవాన్ని తెలియజేసినట్లే. వినడం స్నేహబంధాలు బలపడటానికి పునాది. ఓపికగా వినే వారే మంచి స్నేహితులు అవుతారు. అలా వినే అలవాటు లేకపోతే సాధనతో నేర్చుకోవాలి. స్నేహితులు, పరిచయస్తులు ఎక్కువగా ఉన్న వ్యక్తికి తన మీద తనకు నమ్మకం పెరుగుతుందట. అది పిల్లలు చదువులో రాణించడానికి తోడ్పడితే, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అతిగా మాట్లాడటం వల్ల బీపీ పెరుగుతుంది, అదే శ్రద్ధగా వినటం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వాస్తవాలు ఇలా..
ఎలా వినాలంటే…
మూడిటినీ ముడి వేయాలి..
చివరిగా ఓ ముఖ్యమైన విషయం. మెదడు సమాచారం కోసం వింటుంది. హృదయం సమాచారంలో బంధాలను పెనవేసే విషయాలపై దృష్టి పెడుతుంది. శరీరం భౌతిక అంశాలకు బాధ్యత వహిస్తుంది. మెదడు, హృదయం, శరీరాల సమన్వయంతో వినే వారే మంచి శ్రోత కాగలరు.
వినటంలో వీరులు వారే..
మహిళలు మంచి శ్రోతలు. మగవాళ్లు వినే సమయంలో మెదడులో సగభాగాన్ని వినియోగిస్తారని, స్త్రీలు మెదడులోని రెండు భాగాలు వినియోగిస్తారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. బాగా వినే పురుషులను స్త్రీలు ఇష్టపడతారని వారు చెబుతున్నారు. ఓపిగ్గా వినడం అలవాటు లేకపోవడం వల్లే చాలా మంది పురుషులు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
=బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261