e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

20.6.2021 నుంచి 26.6.2021 వరకు

మేషం
పనులను ప్రణాళికాయుతంగా చేస్తారు. అనుకున్న సమయంలో పూర్తి చేసి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. పనులను సంతృప్తిగా పూర్తి చేస్తారు. స్నేహితులు, బంధువులతో ఖర్చులు పెరుగవచ్చు. వారివల్ల కొంత సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. నిత్య వ్యాపారంలో కొంత ఇబ్బంది ఉన్నా మొత్తం మీద లాభదాయకంగానే ఉంటుంది.

- Advertisement -

వృషభం
స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరగవచ్చు. పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ్ద అవసరం. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి చేసే పనులపై మనసు నిలపడం అత్యవసరం. వృత్తిపరంగా అనుకూలమైన వారం. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులవల్ల ఖర్చులు ఉంటాయి.

మిథునం
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. మంచివారి సాహచర్యంతో కార్య సాఫల్యత ఉంటుంది. ఆలోచనలను అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో చిన్న మనస్పర్థలు ఏర్పడినా అధికారుల అండదండలు బాగా లభిస్తాయి. సంతృప్తిగా పనులను పూర్తి చేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలతో సంతోషంగా, హాయిగా గడుపుతారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు. వృత్తి పరంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులుకూడా పెరుగవచ్చు. వ్యాపారస్తులు ఆలోచించి పెట్టుబడులు పెడతారు. భాగస్వాముల సహకారం లభిస్తుంది.

కర్కాటకం
వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా పనులు నిర్వర్తించాలి. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా ఉంటూ పనులను నెరవేర్చుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండే అవకాశం ఉంది. కోర్టు కేసులలో తాత్కాలిక ఊరట లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు సిబ్బందితో ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యాపార భాగస్వాముల నుంచి మంచి సహకారం ఉండటంతో వ్యాపారంలో సంతృప్తి ఉంటుంది. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు.

సింహం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ప్రమోషన్‌లు రావచ్చు. అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితులు, బంధువర్గం వల్ల ఖర్చులు ఉండవచ్చు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. కావలసిన వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సంతృప్తిగా ఉంటారు. పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. వ్యాపారం అనుకూలిస్తుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

కన్య
తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. సమాజంలో మంచివారి సాహచర్యం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. కార్యసాఫల్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో సంతృప్తి ఉంటుంది. పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. నిర్ణయాలను సమయానుకూలంగా అమలు చేస్తారు. సంగీత, సాహిత్య, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో మంచిపేరు లభిస్తుంది.

తుల
పెద్దల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సూచనల మేరకు పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉన్నత విద్యా యత్నాలలో కొంత ఆర్థిక ఇబ్బంది ఎదురైనా పనులు పూర్తవుతాయి. స్నేహితులు, బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. బరువు, బాధ్యతలు పెరుగడంతో కొంత శారీరక అలసటకు గురవుతారు. అదృష్టం అనుకూలిస్తుంది. వాహనాలవల్ల పనులు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. వృథా ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో సర్దుబాట్లు అవసరమవుతాయి. శ్రమించి పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు.

వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వృత్తిపరంగా సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఉండవచ్చు. రెట్టింపు ప్రయత్నాలు అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. కొంతవరకు సఫలీకృతులవుతారు. వ్యాపారస్తులకు సిబ్బంది తోడ్పాటు లభిస్తుంది.

ధనుస్సు
నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. వృత్తిలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలవల్ల అలసట, ఖర్చులు పెరుగవచ్చు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో, పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసివస్తాయి. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. స్నేహితులు, బంధువుల రాకతో అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్య, కళాకారులకు ఈవారం అనుకూలిస్తుంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

మకరం
తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందినా లోటు లేకుండా పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశంతో కొత్త ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పరిష్కరించుకోవాలి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కర్తవ్యంపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి.

కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బు లేకపోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. స్నేహితులు, బంధుమిత్రుల సహకారంతో శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో చేపట్టిన పనులలో కొంతవరకు సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో సర్దుబాట్లు అవసరమవుతాయి. ఆలోచనలను తొందర పడకుండా సరైన సమయంలో ఆచరణలో పెట్టడం ఈవారం అవసరం. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.

మీనం
శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెడతారు. గత పెట్టుబడులకు ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సిబ్బంది అనుకూలతవల్ల సంతృప్తి ఉంటుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. కావలసిన వస్తువులను కొంటారు. స్నేహితులు, బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు
రాశి ఫలాలు
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement