నెలాఖరులో ఉద్యోగ విరమణ. ఒకటో తేదీన ఆఫీసులో సన్మానం. రెండో తేదీన ఆత్మీయులకు విందు. మూడో తేదీన విశ్రాంతి. నాలుగో తేదీన పిల్లలకు ఆస్తి పంపకాలు. పర్సులోని పది రూపాయల నోట్లతో సహా.. ఎవరి వాటా వారికి! ఆ తర్వాత? రెండుమూడు దశాబ్దాలపాటు ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడుగుతారు? రిటైర్మెంట్ అంటే.. పరాధీనతకు ప్రారంభం కాదు. పిల్లలపై పెద్ద ఆశలు పెట్టుకోవద్దు.