బద్రి నర్సన్ వెలువరించిన తొలి కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’. ఇందులో 20 కథలు ఉన్నాయి. ప్రతి కథకు ఓ బలమైన నేపథ్యం ఉంది. ఈ కథలు కేవలం కాలక్షేపం కోసం రాసినవి కావు. సమాజంలోని తప్పొప్పులను, అసమానతలను కథాంశాలుగా తీసుకొని, వాటికి చక్కని పరిష్కారాలు సూచిస్తాయి. మరి కొన్ని పాఠకులను ఆలోచింపజేస్తాయి. స్త్రీల న్యాప్కిన్ చుట్టూ అల్లిన ‘మరక మంచిదే’ కథలో మూడు తరాల స్త్రీలు నెలసరి సమయంలో సమాజం నుంచి ఎదుర్కొన్న సమస్యలను దాపరికం లేకుండా చర్చించారు. దేశంలో ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేసే తలారి బతుకులపై రాసిన కథ ‘ఈ శిక్ష మాకొద్దు’.
ఇది పాఠకులను ఆలోచింపజేస్తుంది. తెలుగులో తలారి జీవితాలపై వచ్చిన తొలి కథ ఇదే. నేటి అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యంగా రాసిన కథ ‘కూటివిద్యలు’. ఆర్థికంగా చితికిపోయి దిక్కు తోచని స్థితిలో జాతకాలు చూసే వ్యక్తి సలహా ప్రకారం తనకున్న ఒక డొక్కు వాహనాన్ని ‘రథం గుడి’ గా మార్చుతాడు. అందులో దేవుళ్లను ప్రతిష్ఠించి, మైకులో భక్తి పాటలు వినిపిస్తూ వీధుల్లో తిరుగుతాడు. భక్తుల ఆదరణతో అతని ఆదాయం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి. ‘చావు-నీడ’ కథలో వృద్ధాప్యంలో ఎదురయ్యే విషాద సంఘటనలకు కుంగిపోకుండా జీవితంలో చివరి క్షణం వరకు ఆశావహ దృక్పథం కలిగి ఉండాలని సందేశం ఉంది.
ఇక ‘పాలు మరచినవాళ్లు’ కథ స్వార్థ బుద్ధితో కొడుకులు కన్నవాళ్లను తమ అవసరాలకు వాడుకొనే తీరు కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తుంది. మతాతీత సహజీవనంలో మతం కన్నా జీవితం ఉన్నతమైనదని ‘దారి తెలిసిన మేఘం’ కథ తెలియజేస్తుంది. బంధాలు – అనుబంధాలు, జానకి విముక్తి కథలు పడుపు వృత్తిలోని అనేక పార్శ్వాలను మన ముందు ఉంచుతాయి. వరశాపం, సుమిత్ర కథలు రెండూ స్త్రీ పురుషుల సంబంధాలను కొత్త కోణంలో చూపెడతాయి. ఇలా ‘దారి తెలిసిన మేఘం’ సంకలనంలో కథలన్నీ వాస్తవానికి, జీవితాలకు దగ్గరగా సాగుతాయి.
రచన: బద్రి నర్సన్
పేజీలు: 160, ధర: రూ. 150
ప్రచురణ: నీలమ్ పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్
ఫోన్: 9440128169
…? జి. గంగాధర్
రచన: డా. ఎం. పురుషోత్తమాచార్య
పేజీలు: 48; ధర: రూ. 70
ప్రతులకు: ఫోన్: 93966 11905
రచన: శరద్యుతి
పేజీలు: 118; ధర: రూ. 200
ప్రచురణ: జేవీ పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్
ఫోన్: 90004 13413