ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్రదం. పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం సంప్రదాయం. ఈ తొమ్మిది రూపాలను నవదుర్గలుగా చెబుతారు. అవి..
అంటే పర్వతాలకు సంబంధించిన దేవత అని అర్థం. ఇది అమ్మవారి రూపాల్లో మొదటి దశ. పర్వతాల్లో జన్మించిన పార్వతి హిమాలయాల్లో నివసించే ఆది యోగి శివుణ్ని పెళ్లాడాలని అనుకుంటుంది. కానీ, శివుడు అందుకు ఒప్పుకోడు.
ఇది అమ్మవారి రెండో దశ. ఇందులో శక్తి.. తపస్సు చేసే యోగిని బ్రహ్మచారిణిగా ఉంటుంది. అలా ఆమె ఆదియోగి శివుణ్ని అనుకరిస్తుందన్నమాట. అయితే సృష్టిలో స్త్రీలు, పురుషులు అంతా బ్రహ్మచర్యం పాటిస్తే ఏం జరుగుతుందో శివుడు తెలుసుకుంటాడు. దాంతో శక్తి లేకుంటే శివుడికి అర్థం ఉండదని గ్రహిస్తాడు. పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
గంట ఆకారంలో ఉన్న చంద్రుడిని పోలింది అని ఈ పదబంధానికి అర్థం. ఇది పెరుగుతున్న చంద్రుడి కళకు సంబంధించింది. శివుడు క్షయం చెందుతున్న చంద్రుడైతే, శక్తిని కలిగి ఉంటే ఆయన వృద్ధి చెందుతున్న చంద్రుడిగా మారతాడు.
శివుణ్ని పెళ్లి చేసుకోవడంతో అమ్మవారు పరిపూర్ణం చెందుతుంది. అలా ఆమె కూష్మాండగా మారుతుంది.
శివుడితో జీవితం ప్రారంభించిన పార్వతికి కుమారస్వామి- స్కందుడు జన్మిస్తాడు. అలా జగన్మాత స్కందమాతగా మారుతుంది.
ఈ రూపంలో మహిషాసురుడితో పోరాడుతుంది.
ఏడో రూపంలో అమ్మవారు చండముండాసురులను సంహరిస్తుంది. ఇది అమ్మవారి భయానకమైన నల్లటి రూపం. ఆ తర్వాత ఆమె ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది.
ఆ తర్వాత అమ్మవారు గృహిణిగా మారిపోతుంది. జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకుంటుంది. అన్నపూర్ణగా మారి భర్త శివుడికి అన్నం తినిపిస్తుంది.
ఇది అమ్మవారి రూపాల్లో పరిపూర్ణమైన రూపం. దీంతో పార్వతికి అర్ధనారీశ్వర తత్వం సిద్ధిస్తుంది. అలా విశ్వసృష్టికి కూడా ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు పరిపూర్ణత్వం కల్పిస్తారు. హైందవ ధర్మంలో దేవతకు ఉద్దేశించిన పరమోన్నతమైన పాత్ర కూడా ఇదే.
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకమ్
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయని తథా
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా