గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 02:00:45

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం

ఈ వారం చివరిలో అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. నియంత్రణతో ఉండటం మంచిది. ఉద్యోగంలో తోటివారితో అనుకూలత, బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. సాంస్కృతిక, దైవిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. చదువులో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభించవచ్చు. అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తుల క్రయ విక్రయాలలో కొంత జాగ్రత్త అవసరం. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గత పెట్టుబడుల ప్రతిఫలాలు అందుతాయి. ఖర్చులు ఉండవచ్చు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. తీసుకున్న రుణాలను చెల్లిస్తారు. 

వృషభం

గతంలో ప్రారంభించిన పనులన్నిటిలోనూ పురోభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చుల మూలంగా తలపెట్టిన పనులలో ఆలస్యం జరగొచ్చు. తాత్కాలికంగా పనులు అనుకూలిస్తాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. అయినా, జాగ్రత్త అవసరం. సమయస్ఫూర్తితో పరిస్థితులను ఎదుర్కొంటారు. సమాజంలో మంచివారితో స్నేహానికి ప్రయత్నిస్తారు. ఆస్తులు, భూముల విషయంలో వివాదాలు ఎదురుకావచ్చు. భూములు, వాహనాల క్రయవిక్రయాలలో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని రోజులదాకా వేచి ఉండటం మంచిది. డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. ఆర్థిక సర్దుబాట్లు అవసరం కావచ్చు. 

మిథునం

వారం ప్రారంభంలో ఆరోగ్యం పట్ల, రావలసిన డబ్బుపైన శ్రద్ధ వహించాలి. మిగతా రోజులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పనిభారం ఉన్నా గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు సంతృప్తికరం. సమయానికి తగిన ఆలోచనలతో పనులు చేస్తారు. అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. పోటీ పరీక్షలు, పై చదువులలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న స్థాయిలో వేతనం ఉండక పోవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులవల్ల పనులలో ఆలస్యం కావచ్చు. ప్రయాణాల వల్ల ఖర్చులు ఉంటాయి. 

కర్కాటకం

వారం మధ్యలో పనివారితో ఇబ్బందులు, వృథా ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు ప్రయత్న పూర్వకంగా పూర్తవుతాయి. సమాజంలో మంచివారితో పరిచయాలు పెరుగుతాయి. అభివృద్ధికి తగినట్లుగా పనులు చేస్తారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సమయానుకూలంగా నిర్ణయాలు ఉంటాయి. గృహ నిర్మాణం, వివాహ, శుభకార్య ప్రయత్నాలలో తాత్కాలిక అవాంతరాలు రావచ్చు. పెద్దల సహాయ సహకారాలతో పనులు ముందుకు సాగుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో మనస్పర్థలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య సాఫల్యత ఉంటుంది. ఇతరుల నుండి రావలసిన సొమ్ము కొంత వస్తుంది. ఆదాయం తృప్తిగా ఉంటుంది. 

సింహం

వారం చివరిలో సమస్యలను ఎదుర్కొంటారు. మిగతా రోజులు అనుకూల ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులు, భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కళాకారులకు, సంగీత ప్రియులకు కొత్త అవకాశాల వల్ల ఆదాయం పెరగవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అన్ని విషయాలలో వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. పరిస్థితి నయమవుతుంది. కొత్త పనులు చేయడంపై మనసు నిలుపుతారు. పెద్దల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. పనులలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. 

కన్య

వారం ప్రారంభంలో కొంత అననుకూలత ఉన్నా, క్రమేపీ పనులు అనుకూలిస్తాయి. సంతోషంతో ఉంటారు. అభిరుచికి తగినట్లుగా పనులు చేస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్యాలపై శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. రోజువారీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలలో జాప్యం ఉండవచ్చు. ఇంటా, బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పనిభారం మూలంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవచ్చు. జాగ్రత్త అవసరం. వృథా ఆలోచనలను పక్కనపెట్టి ఉపయోగపడే పనులను చేయడం చాలా అవసరం. 

తుల

ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నా మిగతా రోజులు సామాన్యంగా ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆలస్యం ఉంటుంది. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందకపోవడంతో పనులు నిలిచి పోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సర్దుబాట్లు చేసుకోవడం అవసరం. వృత్తి, ఉద్యోగంలో రాబడి స్థిరంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. మానసిక అధైర్యం చోటు చేసుకోవచ్చు. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలలోకి వెళ్లకుండా సామరస్యంగా పనులు పూర్తి చేసుకోవాలి. సమాజంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, పాత స్నేహితులను కలవడం వల్ల ఖర్చులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభించవచ్చు.

వృశ్చికం

వారం మధ్యలో అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంతృప్తితో పనులు చేస్తారు. సోదరులు, బంధువులు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలలో రాబడి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. శ్రద్ధతో పనులను చేయడం మూలంగా గౌరవ మర్యాదలను పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉండటం వల్ల పెట్టుబడులు, పొదుపు, ఆస్తుల కొనుగోలు విషయమై ఆలోచిస్తారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలకు పనివారితో అనుకూలత, సంతృప్తికరమైన దిగుబడులు ఉంటాయి. 

ధనుస్సు

వారం చివరిలో ఖర్చులు ఉంటాయి. క్రమేపీ ఖర్చులు కొంత తగ్గినా వారం అంతా నియంత్రణ అవసరం. ప్రయాణాల మూలంగా కార్య సాఫల్యతను పొందుతారు. స్నేహితులు, బంధువర్గం వల్ల ఖర్చులు ఉంటాయి. కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. నిత్య వ్యాపారాలలో తాత్కాలిక లాభాలు ఉండవచ్చు. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. కొత్త పనులను ప్రారంభించకుండా పాతవి పూర్తి చేయడంపై మనసు నిలపాలి. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. ఆర్థిక సమస్యల మూలంగా వస్త్ర, వస్తువుల కొనుగోలు వాయిదా పడవచ్చు. సినిమా, సాహిత్య, సంగీత ప్రియులకు నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయం ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. 

మకరం

ఈ వారం సామాన్యంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉండవచ్చు. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ పెద్దల సలహా మేరకు పనులు చేయడంలో కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు. సమయానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. ఆర్థిక ఇబ్బందులు మటుకు వెంటాడుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓపికతో పనులు చేసుకోవాలి. శుభకార్యాలవల్ల ఖర్చులు ఉంటాయి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయులతో మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. వాహనాల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. 

కుంభం

వారం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బంది ఉన్నా పనులను పూర్తి చేస్తారు. స్నేహితులు, సోదరులు, ఆత్మీయులతో సంబంధాలు వృద్ధి పొందుతాయి. గతంలో ఉన్న ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. నిత్య వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఇంట్లో అందరి సహాయ సహకారాలను పొందుతారు. అనుకూల వాతావరణం ఉంటుంది. 

మీనం

వారం మధ్యలో వృథా ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గతంలో రుణంగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. పొదుపుపై మనసు నిలుపుతారు. కుటుంబసభ్యులు, భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. కావలసిన వస్తువులను కొంటారు. ఆచార, సంప్రదాయాలపై శ్రద్ధ కనబరుస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరం అనుకున్న పనులను పక్కనపెట్టి మిగతా పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.


logo