గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 03:28:41

గుహలే గృహాలు

గుహలే  గృహాలు

  ఇరాన్‌ దేశంలోని అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లో ఉండే గ్రామమే ‘కండోవన్‌'. కొండ ప్రాంతంలో ఉండే ఈ ఊరిలో ఎటు చూసినా పాము పుట్టల్లాంటి రాతి గుహలే దర్శనమిస్తాయి. వీటిని స్థానిక భాషలో ‘కరన్‌'గా వ్యవహరిస్తారు. 700 ఏండ్లుగా కండోవన్‌వాసులు ఈ గుహలనే తమ నివాస గృహాలుగా ఉపయోగించుకుంటున్నారు. మారుతున్న తరాలకు అనుగుణంగా వసతులను మార్చుకుంటూ, ఆ గుహల్లోనే సౌకర్యవంతంగా జీవిస్తున్నారు. ఒక్కో గుహలో మూడు నుంచి నాలుగు గదులు, స్టోర్‌ రూమ్‌తోపాటు పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా షెల్టర్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటికి తలుపులు, కిటికీలతోపాటు పై అంతస్తులు.. వాటిపైకి వెళ్లడానికి మెట్లు కూడా నిర్మించుకున్నారు. తమ పూర్వీకులు కొండ గుహలనే నివాసాలుగా మార్చుకున్నారనీ, వారి వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తున్నామని కండోవన్‌వాసులు చెబుతున్నారు. వేసవికాలంలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉండటం ఈ గుహలకున్న మరో ప్రత్యేకత. అన్నట్టూ.. ఈ వింతైన గృహాలను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారి కోసమే కొన్ని గుహలను లాడ్జీలుగానూ మార్చేశారు. సందర్శకుల సౌకర్యార్థం ఇక్కడ ఓ హోటల్‌ను కూడా నిర్మించారు. కొండరాయిని తొలిచి మరీ ‘రాకీ హోటల్‌'ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 

ఒక్కో గుహలో మూడు నుంచి నాలుగు గదులు, స్టోర్‌ రూమ్‌తోపాటు పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా షెల్టర్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటికి తలుపులు, కిటికీలతోపాటు పై అంతస్తులు.. వాటిపైకి వెళ్లడానికి మెట్లు కూడా నిర్మించుకున్నారు. తమ పూర్వీకులు కొండ గుహలనే నివాసాలుగా మార్చుకున్నారనీ, వారి వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తున్నామని కండోవన్‌వాసులు చెబుతున్నారు. 


logo