శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Feb 15, 2020 , 23:22:44

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

మేషం:

ఈ వారంలో ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు.పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వీరిలోని చాకచక్యం, విద్వత్తు నలుగురూ గుర్తిస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సహకారాలు అందుతాయి.  అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు.  సంఘంలో పలుకుబడి  ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తి గొడవలు తీరుతాయి.   పాత బాకీలు తీరుస్తారు. షేర్‌, వడ్డీ, నిత్యావసర వస్తు వ్యాపారాల్లోని వారికి బాగా కలిసి వస్తుంది.


వృషభం:

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి.  సూర్యుడు, బుధుడు, శుక్రుని, అనుకూల సంచారం వల్ల పట్టుదలతో, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తే  ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో  సంతోషంగా గడుపుతారు. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత, సినిమా, సాహిత్య రంగాల్లోని వారికి  గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారం కలిసివస్తుంది. న్యాయవాద వృత్తిలోని వారికి  బాగా అనుకూలిస్తుంది. ఉద్యోగులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు  మంచిపేరు, రాజకీయ పరమైన ప్రోత్సాహం లభిస్తాయి. 


మిథునం:

 ఈ వారంలో ఈ రాశి వారికి గురుస్థితి అనుకూలంగా ఉంది. చిన్నపుడు తమతో పాటు చదువుకున్న వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  మంచి పేరును పొందుతారు. ఉన్నతవిద్యా ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ  ఉంటుంది.  విహారయాత్రలు, తీర్థయాత్రల వల్ల మానసిక స్థయిర్యాన్ని పొందుతారు. ముఖ్యంగా పేరు ప్రతిష్టలు ఉన్నవారితో స్నేహం వల్ల  చాలా పనులు కలిసి వస్తాయి.  దేవతా, గురుభక్తి పెరుగుతుంది.


కర్కాటకం:

ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కుజుడు, బుధుడు, శుక్రుని అనుకూల సంచారం వల్ల  కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు బాగా కలిసివస్తుంది. రియల్‌ఎస్టేట్‌లో  ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సహకారాలు బాగా అందుతాయి. ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా బాగా కలిసివస్తుంది.  నిత్య వ్యాపారం లాభదాయకం. న్యాయవాద వృత్తిలోని వారికి  అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వారి సహకారంతో పనులు నెరవేరుతాయి. మంచి పరిచయాలు కొనసాగుతాయి. 


సింహం:

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంతో పనులు చేస్తారు. పనులు పూర్తవుతాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు చేపడతారు. నలుగురిలో పేరును సంపాదిస్తారు. మంచివారి సహాయ సహకారాలు అందుతాయి. గుర్తింపును పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. పనివారు అనుకూలంగా ఉంటారు. సమన్వయముతో ఉంటారు. 


కన్య:

ఈ వారంలో ఈరాశి ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆఫీసులో గుర్తింపు పొందుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు పొందే అవకాశాలున్నాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. నిత్య వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఇంజినీరింగ్‌ వృత్తిలోని వారికి, రాజకీయంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలుంటాయి.  తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సహాయ సహకారాలతో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. 


తుల:

ఈ వారంలో ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది. పనివారితో ఇబ్బందులు.  పనులు ముందుకు సాగకపోవడం. ఆత్మ స్థయిర్యంతో ఉండడం చాలా అవసరం.ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ప్రయోజనం చేకూరుతుంది. శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించాలి. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు.  దేవతా, గురుభక్తిని పెంపొందించుకోవడం అవసరం. స్నేహితులు, బంధువులు, సోదరులతో కొంత అనుకూలత ఉంటుంది. 


వృశ్చికం:

ఈ వారంలో ఈ రాశి వారికి సంఘంలో మంచివారితో పరిచయాలు బాగా పెరుగుతాయి. శ్రేయోభిలాషుల వల్ల పనులు బాగా నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు బాగా అనుకూలమైన వారం. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో మంచి మార్కులతో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. పనుల్లో ఆటంకం   దూరం అవుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. 


ధనుస్సు:

 రాజకీయంలో ఉన్న వారికి అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి.  ప్రమోషన్‌లు, అనుకున్న ప్రాంతాలకు బదిలీలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సంగీత, సాహిత్య, పత్రికా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సంతృప్తికరంగా ఉంటారు.  ప్రధాన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది.  కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడుల విషయమై జాగ్రత్త అవసరం. లేదా కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. విద్యార్థులు అనుకున్నదాని కోసం శ్రమించాలి.


మకరం:

ఈ వారంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.  కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు.  సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి బాగా కలిసి వస్తుంది.  ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. మానసిక , శారీరక ఇబ్బందులు తొలగుతాయి. ప్రధానంగా ఈ వారంలో సహనం, పనులలో నిబద్ధత అవసరం. నిత్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. దేవతా, గురుభక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తాత్కాలిక ఉద్యోగం లభించవచ్చు. పెద్దల సహకారాలు విస్మరించొద్దు. 


కుంభం:

ఈ రాశి వారికి ఈ వారంలో పెద్దల  సహకారాలు బాగా కలిసి వస్తాయి.    సద్వినియోగం చేసుకోవడం వల్ల ఫలితాలుంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, నదీస్నానాలు ఆచరిస్తారు. సంఘంలోని పెద్దవారితో సత్సంబంధాలను పెంపొందించుకుంటారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. శ్రేయోభిలాషులు, సోదరులు అనుకూలంగా ఉంటారు. నిర్మాణరంగంలోని వారికి బాగా అనుకూలమైన వారం. పనులు నెరవేరుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతృప్తిగా ఉంటారు. 


మీనం:

ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరుగుతుంది. సంతృప్తికరంగా ఉంటారు. కొత్త పనులు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. పనివారితో ఇబ్బందులు దూరమవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం ఉంది.  ఇంట్లో అందరితోనూ సంతోషంగా, సమన్వయంతో ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ఈ వారం తాత్కాలికంగా కలిసి వస్తుంది. వైద్యవృత్తిలోని వారికి ఆదాయం పెరుగుతుంది. రాబడి అనుకూలంగా ఉంటుంది. దేవతా, గురుభక్తి ఆత్మస్థయిర్యం ప్రధానంగా ఈ వారం అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.