20 years of TRS | CM KCR | తెలంగాణ ఏర్పడింది. తొలి కేబినెట్ మీటింగ్ మొదలైంది. వలస పాలనతో, వరుస కష్టాలతో, 14 ఏండ్ల ఉద్యమంతో నీరసించి ఉన్న తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. పెన్షన్ల పెంపు మొదలుకుని, ఏకబిగిన 40కి పైగా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించారు.
అన్ని పథకాలనూ ఒకేసారి ప్రవేశపెట్టడానికి బదులు, ఒకదాని తర్వాత మరొకటి ప్రవేశపెడితే బాగుంటుందనీ, దీనివల్ల రాజకీయంగా పార్టీ కన్సాలిడేట్ అవుతుందని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. కానీ కేసీఆర్ నిర్దంద్వంగా నిరాకరించారు. “మీరంతా రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. నేను దెబ్బతిని ఉన్న ప్రజల కోణంలో ఆలోచిస్తున్నాను” అని హితవు పలికారు. అవకాశం దొరికింది కదా అని రాజకీయాల్లోకి రావడం కాదు; రాజకీయాలపై ప్రేమతో, ప్రజా సేవపై అనురక్తితో రాజకీయాలు చేయాలి (పాలిటిక్స్ నాట్ బై చాన్స్, పాలిటిక్స్ బై చాయిస్) అని చెప్తుంటారు. 38 ఏండ్ల రాజకీయ జీవితంలో నాటి నుంచి నేటి దాకా కేసీఆర్‌ది ఒకటే పంథా!
రైతుబంధు పథకం నేను బతికున్నంత కాలం కొనసాగిస్తాం. రైతుబంధు అమలుకు ఓ ప్రత్యేకమైన సిస్టం ఉన్నది. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా అమలవుతుంది. ఈ పథకం పరిమితి లేకుండా అందరికీ వర్తింపజేస్తున్నాం.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు