20 years of TRS | CM KCR | ఒకరోజు కేసీఆర్ హైదరాబాద్‌లో మెట్లు దిగుతున్నారు. ఇంటి ముందు ఒక ముస్లిం మహిళ నిలుచుని ఉంది. సార్‌కు సలాం చెప్పి, తన బిడ్డకు ఎంబీబీఎస్ సీటు వచ్చిందనీ, డబ్బు కడితే ఆమెకు చదువుకునే అవకాశం దక్కుతుందనీ వేడుకుంది. ఉద్యమం మొదలై అప్పటికి రెండు మూడేండ్లే. ఆ ముస్లిం మహిళ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నది. ఆమె మాటలు విన్న కేసీఆర్ వెంటనే ఇంట్లోకి మరలి వెళ్లారు.
‘ఒక మహిళకు డబ్బులు అవసరం ఉన్నాయి, సర్దుబాటు చేయగలవా?’ అని అప్పుడు పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న హరీశ్‌రావును అడిగారు. కొంచెం సేపటి తర్వాత ఆయన ఫోన్ చేసి, డబ్బు సర్దుబాటు కాలేదని చెప్పారు. కానీ కేసీఆర్ ఊరుకోలేదు. సాయంత్రం దాకా ఫోన్ల మీద ఫోన్లు చేసి, తాను కొంత కలిపి, అవసరమైన ఎమౌంట్‌ను, ఆమె చేతిలో పెట్టిగానీ బయటకు పోలేదు. పిన్ని చేతుల్లో అష్టకష్టాలు పడ్డ బాలికను దత్తత తీసుకుని పెళ్లి చేసినా, పేదలు పెళ్లి కార్డు ఇస్తే పుస్తె మట్టెలు, డబ్బులు సాయం చేసినా అవన్నీ ఆ ఆర్తిలోంచి పుట్టేవే. ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు సన్నిహితుడు ఒకరికి తీవ్ర అనారోగ్య సమస్య వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రికి స్వయంగా ఫోన్ చేసి అడిగినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అతి కష్టం మీద భారీ మొత్తం సమకూర్చగలిగారు. ఆ బాధలోంచే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేసే సాయానికి పరిమితిని ఎత్తేసి అన్లిమిటెడ్ చేశారు. దటీజ్ కేసీఆర్.
తెలంగాణలో ఎన్నో కోటలు ఉన్నాయి. వారసత్వ సంపద పరిరక్షణకు కొత్త చట్టం తెచ్చాం. చారిత్రక కట్టడాల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. అందుకే ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటే, ఇక్కడ కూడా గోల్కొండ కోట వద్ద నిర్వహిస్తున్నాం. దీనిని తెలంగాణ సమాజం హర్షిస్తున్నది.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు