బాడీలో మార్పులొస్తున్నాయి.. పెండ్లంటే భయమేస్తోంది.. ఏం చేయాలి?
Health Tips | నాకు 27 ఏండ్లు. రెండేండ్ల నుంచి నా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఒంటి మీద వెంట్రుకలు పల్చబడిపోతున్నాయి. తలమీద, జననాంగాల దగ్గర కూడా రాలిపోతున్నాయి. గొంతు దగ్గర కొద్దిగా వాపు కనిపిస్తున్నది. పొట్ట పెరిగింది. తరచూ తలనొప్పి, వొళ్లు నొప్పులు, ఆయాసం వస్తున్నాయి. చర్మం ఎండిపోయి కండ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఉద్రేకం, చిరాకు, కోపం పెరుగుతున్నాయి. చాలా నీరసంగా, శక్తి కోల్పోయినట్టుగా అనిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సెక్స్ కోరికలు కూడా కలగడం లేదు. పెండ్లి చేసుకోవాలన్నా భయంగా ఉంది. నన్నేం చేయమంటారు?
– ఓ యువకుడు

మీరు పేర్కొన్న లక్షణాలన్నీ హైపో థైరాయిడ్ సమస్యను సూచిస్తున్నాయి. మీరు ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించండి. వాళ్లు మీ థైరాయిడ్ ప్రొఫైల్ ఎగ్జామిన్ చేస్తారు. అలాగే సెక్స్‌పై మునుపటి ఉత్సాహం లేదని, కోరికలు కలగడం లేదంటున్నారు. కాబట్టి, ఆర్బీఎస్, సీబీపీ, ఎల్ఎఫ్టీ, రీనల్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఆండోజెన్ ప్రొఫైల్, సెక్స్ హార్మోన్ లెవెల్స్ లాంటి పరీక్షలు చేయించాలి. థైరాయిడ్ ప్రొఫైల్‌తో థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. సమస్య ఉంటే, జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. మందులు మొదలుపెట్టిన తర్వాత మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్యకు, సెక్స్ కోరికలకు సంబంధం ఉంది. ఎండోక్రైనాలజిస్ట్తో పాటు సెక్స్ సమస్య పరిష్కారానికి యూరో-ఆండ్రాలజిస్ట్‌ను, సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి. లైంగిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
– డాక్టర్ భారతి, సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్. ఫోన్: 9849770409, ఈ మెయిల్: bharathid506@gmail.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

