విషాదం ఆమె అదృష్టవంతురాలు..గర్భస్రావం విఫలమైంది.ఆమె దురదృష్టవంతురాలు.గర్భస్రావం తల్లిని మింగేసింది.నాన్న దృష్టిలో తను ఇప్పటికీ..విలుకాడి బాణం నుంచి తప్పించుకున్నలేడిపిల్లే.. ఆడపిల్లే!కొన్ని పుట్టినరోజులకు గుండెకోతే.. కేక్ కటింగ్!
‘నీ కంటే పొడుగ్గా, నీ కంటే అందంగా..నీ కంటే తెలివిగా ఉండే అబ్బాయిని..’చెబుతూ పోతున్నది.‘కొంపదీసి ప్రేమించావా?’ ఆట పట్టించాడు భర్త.‘కాదు. నీకివ్వబోతున్నా’సిగ్గుల మొగ్గవుతూ చెప్పింది.
‘మన అబ్బాయి రెగ్యులర్గా క్లాసులకు వెళ్తున్నాడట.ప్రిన్సిపల్ నుంచి మెసేజ్.దారిన పడ్డట్టున్నాడు’తండ్రి సంతోషించాడు. ‘కాదు.. ప్రేమన పడ్డట్టున్నాడు’మనసులోనే అనుకుంది తల్లి.
అతడి ప్రేమ ప్రతిపాదన..‘నీ కంట తడి లేకుండా చూసుకునే బాధ్యత నాదీ! విల్ యు మ్యారీ మీ’ ఆమె కండ్లలోంచి జలజలా నీళ్లు .. ఉద్వేగంతో!
గుడి దగ్గర.బాగా పరిచయం ఉన్న స్వరంలో..నాకు ఇష్టమైన నా ముద్దు పేరుతో..ఎవరో పిలుస్తున్నారు.తల తిప్పి చూశాను. ఆమే!కానీ, నన్ను కాదు.తన మూడేండ్ల కొడుకును