ఒకప్పుడు బొమ్మలంటే చెక్క బొమ్మలే!విసిరేసినా, తొక్కేసినా, నీళ్లలో పడేసినా,
పళ్లతో కొరికేసినా.. బొమ్మకు కష్టం ఉండేది కాదు, ఆడుకొనే బంగారు తల్లికీ నష్టం
వాటిల్లేది కాదు. క్రమంగా ఆ స్థానాన్నిప్లాస్టిక్ బొమ్మలు ఆక్రమించాయి.ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసే ప్రయత్నంలో మళ్లీ చెక్క బొమ్మలకు ఆదరణపెరుగుతున్నది.
అన్నం తినే కంచం నుంచి ఆడుకొనే బొమ్మల వరకూ అన్నిట్లోకీ ప్లాస్టిక్ భూతం దూరేసింది. అదే సమయంలో ప్లాస్టిక్‌వల్ల పర్యావరణానికి, తద్వారా మనుషులకు కలిగే హాని గురించి అవగాహన పెరుగుతున్నది. దాంతో చాలామంది ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లకు స్వస్తి పలికి స్టీలు పాత్రలు వాడుతున్నారు. ఇల్లు, ఇల్లాలి వరకూ ఫర్వాలేదు. మరి, పిల్లల ఆట బొమ్మల సంగతి? దీనికీ ఓ ప్రత్యామ్నాయం వెదికారు. ప్లాస్టిక్ బొమ్మల స్థానంలో చెక్క బొమ్మలకు ఆదరణ పెరుగుతున్నది.
బీడ్స్ అబాకస్ :ప్లే స్కూల్ నుంచి పిల్లలకు అబాకస్ని అలవాటు చేస్తారు. అప్పుడప్పుడే అంకెలు పలుకుతున్న చిన్నారులకు అబాకస్ ద్వారా లెక్కలు నేర్పుతారు. ఇప్పుడు, అబాకస్ స్టాండ్‌తో పాటు వాటి పూసలనూ చెక్కతో చేస్తున్నాయి చాలా కంపెనీలు. దీనివల్ల పిల్లల్లో పర్యావరణం పట్ల బాధ్యత పెరుగుతుంది.
రాక్ బ్లాక్స్ :రంగురంగుల రాళ్లను ఒకదానిపైఒకటి పేర్చడమంటే, పిల్లలకు భలే సరదా. అయితే, ఆ రాళ్లను నవ్వులాటకు విసిరినా, ఎదుటివాళ్లకు దెబ్బ తగులుతుంది. ఇంట్లోని వస్తువులూ పగిలిపోతాయి. అందుకే, చాలాకంపెనీలు సహజసిద్ధమైన రంగులతో చెక్క బ్లాక్స్ తయారు చేస్తున్నాయి.
అందమైన కుటుంబం :ఈమధ్య మార్కెట్లో అన్ని వస్తువుల్లో‘కస్టమైజ్’్డ ఆప్షన్ ఉంటున్నది. ఒక ఇంట్లో అమ్మానాన్న, ఇద్దరు పిల్లలుంటే..చెక్క బొమ్మలను ఆ ఫ్యామిలీ థీమ్తోనేతయారు చేసి ఇస్తున్నారు. అందుకు వాడే రంగులు కూడా పర్యావరణహితమైనవే.
యాక్టివిటీ క్యూబ్ :ప్రీస్కూల్ పిల్లలకు యాక్టివిటీ క్యూబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐదువైపులా ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది.ఏబీసీడీలు, అంకెలు, జంతువులు, ఫిక్షన్ క్యారెక్టర్లు మొదలైనవి ఈ క్యూబ్‌లో ఉంటాయి. ఒక్కసారి దీన్ని కొనేస్తే, కొన్నేండ్ల వరకూ పిల్లలు ఆడుకుంటారు. తాజాగా వీటిని కూడా చెక్కలతో తయారు చేస్తున్నారు. ధర కొంత ఎక్కువే అనిపించినా.. చెక్క బొమ్మలు సురక్షితం! రూపాయల గురించి ఆలోచించకుండా పాపాయికి ‘చెక్క’ని బహుమతిగా ఇవ్వండి!