Startup Stories | ఆడపిల్లలు నాలుగు గోడలకు పరిమితం కాకూడదని..
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీతం సమకూరుస్తారు.
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీతం సమకూరుస్తారు. రేపటితరం ఆంత్రప్రెన్యూర్స్‌కు దిశానిర్దేశం చేస్తారు. సామాజిక సేవకూ సమయం కేటాయిస్తారు. ఏకశిల కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ గొడవర్తి బహుముఖ ప్రజ్ఞకు మూలాలేమిటి? ఆమె మాటల్లోనే ఆ విజయ రహస్యం..

Startup Stories | నాన్న వ్యవసాయ రంగంలో పనిచేశారు. దీంతో జగిత్యాల, మెట్పల్లి, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశాను. కామర్స్‌లో మాస్టర్స్ చదివాను. డిగ్రీ చదువుతున్నప్పుడే.. టైపిస్ట్ ఉద్యోగంలో చేరాను. క్రమంగా సీనియర్ అకౌంటెంట్ స్థాయికి వెళ్లాను. పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా… ఆంత్రప్రెన్యూర్‌షిప్ గురించి చర్చించుకునే వాతావరణంలో పెరిగాను. ఆడపిల్లలు నాలుగు గోడలకు పరిమితం కాకూడదనేవారు అమ్మానాన్న. మహిళల అభిప్రాయాలకు పెద్దపీట వేసే కుటుంబానికి కోడలిగా వెళ్లడం నా అదృష్టం. అప్పటికే మా వారు హైదరాబాద్‌లో ఏకశిల కెమికల్స్ పేరుతో పరిశ్రమ ప్రారంభించారు.
ఆయనకు చేదోడుగా నిలవాలనే ఉద్దేశంతో నేనూ ఫ్యాక్టరీకి వెళ్లేదాన్ని. నా నైపుణ్యాలు, అకౌంటింగ్ సామర్థ్యాలను గుర్తించి కంపెనీలో ముఖ్య బాధ్యతలు అప్పగించారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వ్యవహారాల్లో అన్నిటికీ నేనే అన్నట్టుగా బాధ్యతలు భుజాన వేసుకున్నాను. అప్పటికే ఉన్న మల్లాపూర్ యూనిట్‌కు అదనంగా వైజాగ్‌లో కొత్త శాఖ ప్రారంభించాం. దేవరయాంజల్ ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేపట్టాం. అదే సమయంలో ఓ గృహిణిగా ఇంటి వ్యవహారాలనూ చక్కబెట్టుకుంటాను.
మహిళలకే సాధ్యం
ఇంటికి ఇల్లాలిగా, బిడ్డకు తల్లిగా, ఆఫీసులో ఉద్యోగినిగా.. ఇలా అన్ని బాధ్యతలనూ ఏకకాలంలో చక్కబెట్టే నైపుణ్యం ఆడపిల్లకు పుట్టుకతోనే అబ్బుతుంది. పుట్టినింట, మెట్టినింట ప్రోత్సాహం దొరికితే నాయకురాలుగా ఎదుగుతుందామె. ఆ అనుభవసారాన్ని మరింత మందికి అందించాలని అనిపించేది. ఆ ప్రయత్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ (కొవె)తో అనుబంధం ఎంతో ఉపకరించింది. అప్పటికే నా క్లాస్మేట్ రమాదేవి.. కొవె ప్రెసిడెంట్‌గా ఉండటంతో.. నేనూ ఈ సంస్థలో అడుగుపెట్టాను. నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాతే నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఎంతోమంది ఆంత్రప్రెన్యూర్ల స్ఫూర్తితో ఏకశిల కెమికల్స్‌ను పూర్తిస్థాయిలో భుజాన వేసుకునే ధైర్యం వచ్చింది. కొవె నేతృత్వంలో మహిళా సాధికారతకు పనిచేస్తూనే, బంజారాహిల్స్ రోటరీ క్లబ్ సెక్రటరీగానూ సేవలు అందిస్తున్నాను.
చిన్నతనంలోనే గజ్జెకట్టి..
భరతనాట్యం అంటే తెలియని రోజుల్లోనే… మా అమ్మ గాత్రానికి నృత్యం చేసేదాన్ని. దీంతో పాఠశాల దశలో నృత్యకారిణిగా గుర్తింపు వచ్చింది. ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేదాన్ని. ఇవన్నీ నాకు నాయకత్వ పాఠాలే. కర్ణాటక సంగీతమూ నేర్చుకున్నాను. సొంతంగా రాసుకున్న పాటలకు బాణీకట్టడం ఇష్టమే. కాబట్టే, ఐదుపదుల వయసులోనూ ఉత్సాహంగా ఉండగలుగుతున్నా. ఇకెబనా కళాకారిణిగా, సేంద్రియ రైతుగా, సాహితీ వేత్తగా గుర్తింపు సాధించాను. గత ఏడాది డా. సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డునూ గెలుచుకున్నాను.
సవాళ్లెన్నో
మహిళలు పారిశ్రామిక రంగంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. సాధారణ గృహిణి కనుక ఈ మార్గాన్ని ఎంచుకుంటే మరింత శ్రమించాలి. సొంతకాళ్లపై నిలబడాలనే కృతనిశ్చయం ఉన్న మహిళలను నావంతుగా ప్రోత్సహిస్తాను. అందుకే, బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నాం. విద్యార్థి దశలోనే యువతులను ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా నడిపించే ప్రణాళిక రూపొందిస్తున్నాం.
…? కడార్ల కిరణ్
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

