అపూర్వ ములాని, ప్రియాంక జవేరి.. బాల్య స్నేహితులు. ఇద్దరూ ముంబైలో పుట్టిపెరిగారు. ఇంజినీరింగ్‌లోనూ సహ విద్యార్థులే. కొంతకాలం కొలువులు చేసినా.. పెండ్లి తర్వాత కెరీర్‌కు బ్రేక్ వచ్చేసింది. పిల్లల పెంపకంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
పసిబిడ్డలకు ఏం పెట్టకూడదో తెలిసేది కాదు. ఏం పెట్టాలో అర్థమయ్యేది కాదు. ఎవరిని అడగాలో కూడా తెలిసేది కాదు. తమ అనుభవాలను వ్యాపార ఆలోచనగా మార్చుకుని.. మరో ఇద్దరు మిత్రులను కలుపుకొని.. ‘బేబీ జీ’ అనే స్టార్టప్‌కు ప్రాణం పోశారు. పెద్దలు తెలుసుకోవాల్సిన విషయాలు, పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలు ఇందులో అనేకం. ఏ వయసు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆటలు ఆడించాలి.. తదితర విషయాలన్నీ ఉంటాయి.
పిల్లలకు చెప్పడానికి బోలెడు కథలు, పిల్లలతో పాడించడానికి అనేక పాటలు అప్లోడ్ చేశారు కూడా. ఇప్పటికే రెండున్నర లక్షల డౌన్లోడ్లు జరిగాయని చెబుతున్నారు అపూర్వ. అందులో ఎనభై శాతం మంది పిల్లల పెంపకంలో బేబీజీని భాగం చేసుకున్నారు కూడా. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలోనూ ఈ యాప్‌కు యూజర్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లిష్‌లోనే సేవలు అందిస్తున్నా.. హిందీ, స్పానిష్, కొరియన్ భాషలకూ విస్తరించాలని అనుకుంటున్నారు. అమ్మలతో, కాబోయే అమ్మలతో ఓ ఆన్లైన్ క్లబ్ ప్రారంభించే యోచన ఉందనీ చెబుతున్నారు అపూర్వ, ప్రియాంక.