Araku Cafe | కొన్ని ఆసక్తులు అంతే! మనం ఏం చదువుతున్నా, ఎలాంటి కెరీర్ను ఎంచుకున్నా.. అడుగులు అటువైపే పడతాయి. మహారాష్ట్రకు చెందిన అదితి దుగార్ ఇందుకు ఉదాహరణ. బాల్యం నుంచీ తనకు వంటలంటే ఇష్టం. బీకామ్ తర్వాత సీఎఫ్ఏ చేసి ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్నా కూడా.. ఓ హోటల్ నిర్వహించాలనే ఆసక్తి తగ్గలేదు.
సరికదా, ఉద్యోగమే మానేసేంతగా ప్రేరేపించింది. దీంతో ముంబైలో సేజ్ & సాఫ్రాన్ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఆ విజయం కూడా ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. కస్టమర్లకు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలనే తపనతో ఆసియా, ఐరోపా ఖండాలు చుట్టొచ్చారు. పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. 2016లో ముంబైలో మాస్క్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు. ఓ జాబితా ప్రకారం ఆసియాలోనే రుచికరమైన రెస్టారెంట్లలో 21వ స్థానంలో ఉందిది. వీటితోపాటుగా ‘అరకు కెఫె’ లాంటి గొలుసుకట్టు హోటల్స్నూ నిర్వహిస్తున్నారు.