యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ సూచించాడు. 1945 ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు శాన్ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యూఎన్ చార్టర్‌ను రూపొందించాయి. చార్టర్‌పై 50 దేశాలు 1945, జూన్ 26న సంతకాలు చేశాయి. శాన్ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలాండ్ చార్టర్‌పై సంతకం చేసి 51వ సభ్యదేశంగా అవతరించింది. మొత్తం 193 సభ్యదేశాలుండగా 190వ సభ్యదేశంగా స్విట్జర్లాండ్, 191వ సభ్యదేశంగా తూర్పు తిమోర్ చేరాయి. 2006, జూన్ 3న సెర్బియా నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మాంటెనీగ్రో 2006 జూన్ 28న ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్య దేశంగా చేరింది. 193వ దేశంగా దక్షిణ సూడాన్ (రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్) ఐక్యరాజ్యసమితిలో 2011 జూలై 14న చేరింది. తైవాన్, వాటికన్ సిటీ, లీచ్టెన్స్ టెన్‌లకు సమితిలో సభ్యత్వం లేదు. ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబర్ 24 నుంచి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఐక్యరాజ్యసమితికి, దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్‌కు 2001లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
సాధారణ సభ
భద్రతా మండలి