అసఫ్‌జాహీ పాలన కాలంలో ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతర వృత్తులు నిర్వహించుకోవడానికి అనుకూలంగా భావించి ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు. ఇంకొకవైపు సంస్థానంలో జాగీర్దారీ వ్యవస్థ అమలులో ఉండటంతో, విద్యావకాశాలు అధికంగా లేకపోవడంతో స్థానిక ఉద్యోగాల్లో వారికి అవసరమైన అర్హతలు లేకుండాపోయాయి. దీంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో అసంతృప్తికి లోనైన స్థానికులు, బయటివారి నియామకాలకు వ్యతిరేకంగా ఆనాటి నిజాం నవాబుకు విన్నవించుకున్నారు. ఇదే ముల్కీ ఉద్యమానికి నాంది పలికింది.
ముల్కి ఉద్యమానికి సంబంధించిన మరో కథనం ఇది.
‘when students took part in rallies’ అనే ఆర్టికల్‌ను ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదవండి..