భారతదేశ విస్తరణ గురించి తెలుసుకోవాలంటే ఆక్షాంశ, రేఖాంశాల పరంగా భారతదేశం ఉనికి భూగోళంలో ఎలా ఉందనే అంశాన్ని చర్చించాలి.
భారతదేశ ఉనికి-విస్తరణ
అవి పశ్చిమం నుంచి తూర్పుకు
1) గుజరాత్ (కర్కట రేఖ చివర అడుగుపెట్టే రాష్ట్రం)
2) రాజస్థాన్ (కర్కట రేఖ అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం)
3) మధ్యప్రదేశ్ (కర్కట రేఖ అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం)
4) ఛత్తీస్‌గఢ్
5) జార్ఖండ్
6) పశ్చిమ బెంగాల్
7) త్రిపుర
8) మిజోరం (కర్కట రేఖ మొదటి ప్రవేశించే రాష్ట్రం)
కర్కట రేఖకు సమీపంగా ఉన్న రాజధానులు
1) గాంధీనగర్ (గుజరాత్)
2) భోపాల్ (మధ్య్రపదేశ్)
3) రాంచీ (జార్ఖండ్)
4) ఐజ్వాల్ (మిజోరం)
5) అగర్తలా (త్రిపుర)
కర్కట రేఖకు దగ్గరగా ఉన్న పట్టణాలు
1) అహ్మదాబాద్ (గుజరాత్)
2) ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
3) భోపాల్ (మధ్యప్రదేశ్)
4) జబల్పూర్ (మధ్యప్రదేశ్)
5) హుగ్లీ (పశ్చిమబెంగాల్)
కర్కటరేఖకు సమీపంగా వెళుతున్న నదులు
1) గుజరాత్ – సబర్మతి, మహి
2) రాజస్థాన్ -మహి
3) మధ్యప్రదేశ్ – చంబల్, బెట్వా, కెన్, సోన్
4) జార్ఖండ్ – దామోదర్
5) పశ్చిమ బెంగాల్- దామోదర్, హుగ్లీ
కర్కట రేఖకు సమీపంగా ఉన్న జీవవైవిధ్య ప్రాంతాలు
1) గుజరాత్- రాణ్ ఆఫ్ కచ్ బయో రిజర్వ్
2) మధ్యప్రదేశ్- వనవిహార్, కన్హా , బాంధవ్‌ఘర్ నేషనల్ పార్కులు
3) జార్ఖండ్- పలమావు టైగర్ రిజర్వ్
4) మిజోరం- ముర్లేన్ నేషనల్ పార్క్
5) ఛత్తీస్‌గఢ్- సంజయ్ నేషనల్ పార్క్
కర్కటరేఖకు సమీపంగా ఉన్న కొండలు
భారతదేశ ప్రామాణిక రేఖాంశం
భారత ప్రామాణిక సమయాన్ని (IST) మొదట పరిచయం చేసిన సంవత్సరం 1947 సెప్టెంబర్ 1. దీనిని నిర్వహించింది న్యూఢిల్లీలోని ‘నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. ఈ సంస్థ భారతదేశానికి రెండు ప్రామాణిక కాలమానాలు ఉండాలని సూచించింది.
1) IST-1: 68O 7 నుంచి 89O52 తూర్పు మధ్య రేఖాంశాలు. ఇది భారతదేశంలో చాలా ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇది రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్ నుంచి కూచ్‌బిహార్ పశ్చిమబెంగాల్ వరకు.
2) IST -II: 89O52 తూర్పు నుంచి 97O 25 తూర్పు మధ్య రేఖాంశాలు. ఇది ఈశాన్య భారత్‌కు మాత్రమే వర్తించేది. ఇది కూచ్బిహా ర్ నుంచి మొత్తం 7 ఈశాన్య రాష్ర్టాలు
23 1/2O ఉత్తర అక్షాంశం (కర్కట రేఖ), 83 1/2O తూర్పు రేఖాంశం ఖండించుకునే ప్రాంతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని బైకుంఠాపురం.
ప్రపంచ కాల మండలాలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక కాల మండలాల సంఖ్య 24
అత్యధికంగా స్థానిక కాల మండలాలున్న దేశాలు
1) ఫ్రాన్స్ – 12
2) రష్యా – 9 (2010లో 11 నుంచి 9కి తగ్గించారు)
3) అమెరికా- 11 (కానీ 4 కాలమండలాలు మాత్రమే వినియోగం)
భారతదేశ ప్రామాణిక రేఖాంశం
ప్రాక్టీస్ బిట్స్..
1. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
1) దామోదర్ నది కర్కట రేఖకు సమాంతరంగా ప్రవహిస్తుంది
2) కర్కట రేఖకు సమీపంగా ఉన్న కన్హా జీవవైవిధ్య సంరక్షణ ప్రాంతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది
3) కర్కట రేఖకు దగ్గరగా ఉన్న దేవ్‌ఘర్ శిఖరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) అన్నీ సరైనవే
2. కర్కట రేఖ-భారత ప్రామాణిక కాలరేఖలు కింది ఏ ప్రాంతంలో ఖండించుకుంటాయి?
ఎ) జబల్పూర్ బి) రేనా
సి) యానాం డి) బైకుంఠాపురం
3. కర్కట రేఖ భారతదేశంలో ఎక్కువ దూరం ఏ రాష్ట్రం నుంచి ప్రయాణిస్తుంది?
ఎ) జార్ఖండ్ బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్ డి) ఛత్తీస్‌గఢ్
4. మహి నది ఏ అక్షాంశాన్ని రెండు సార్లు ఖండిస్తుంది?
ఎ) కర్కట రేఖ బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ డి) ఏదీకాదు
5. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
ఎ) 6045 ఉత్తర అక్షాంశం – గ్రేట్ నికోబార్ దీవి
బి) దక్షిణకొనకు ఉన్న ప్రాంతం- ద్వీపు కనుమ
సి) ఉత్తర కొనకు ఉన్న ప్రాంతం- ఇందిరాపాయింట్
డి) పశ్చిమ కొనకు ఉన్న ప్రాంతం- ఇందిరాకాల్
6. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఏ దేశం గుండా వెళుతుంది?
ఎ) భారతదేశం బి) శ్రీలంక
సి) ఫ్రాన్స్ డి) ఇంగ్లండ్
7. ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి సూర్యకిరణాలకు పట్టే కాలం ఎంత?
ఎ) 8 నిమిషాలు బి) 4 నిమిషాలు
సి) 12 నిమిషాలు డి) ఏదీకాదు
8. భారత ప్రామాణిక సమయాన్ని (ఐఎస్టీ) మొదటగా పరిచయం చేసిన సంవత్సరం?
ఎ) 1947 సెప్టెంబర్ 1
బి) 1948 సెప్టెంబర్ 1
సి) 1946 సెప్టెంబర్ 1
డి) 1945 సెప్టెంబర్ 1
9. బంగ్లాదేశ్ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశంపై గణిస్తారు?
ఎ) 821/2O తూర్పు రేఖాంశం
బి) 90O తూర్పురేఖాంశం
సి) 861/2O తూర్పురేఖాంశం
డి) 70O తూర్పు రేఖాంశం
10. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలను (12) కలిగిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ప్రాన్స్ డి) ఏదీకాదు
11. భారతదేశంలో మొట్టమొదట సూర్చుడు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయించిన ఎన్ని గంటల తర్వాత గుజరాత్లో ఉదయిస్తాడు?
ఎ) 1 గంట 56 నిమిషాలు
బి) 1 గంట 52 నిమిషాలు
సి) 1 గంట 48 నిమిషాలు
డి) 1 గంట 44 నిమిషాలు
12. భారతదేశం, బంగ్లాదేశ్‌ల మధ్య కాలవ్యత్యాసం పరంగా సరైనవి గుర్తించండి?
1) నిమిషాలు బంగ్లాదేశ్ వెనుక ఉంటుంది
2) నిమిషాలు భారత్ వెనుక ఉంటుంది.
3) 30 నిమిషాలు బంగ్లాదేశ్ ముందు ఉంటుంది
4) నిమిషాలు భారత్ ముందు ఉంటుంది
ఎ) 1, 3 బి) 4, 2
సి) 1, 2 డి) 2, 3
13. 821/20 తూర్పు రేఖాంశం కింది ఏ ప్రాంతం గుండా వెళ్లదు?
ఎ) జైపూర్ బి) హైదరాబాద్
సి) గాంధీనగర్ డి) బెంగళూరు
14. కిందివాటిలో ఏ రాష్ట్ర రాజధాని భారత ప్రామాణిక కాలరేఖ గుండా పోతుంది?
ఎ) జైపూర్ బి) హైదరాబాద్
సి) గాంధీనగర్ డి) బెంగళూరు
15. అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది?
ఎ) ఉత్తరార్ధగోళం
బి) తూర్పు అర్ధగోళం
సి) పశ్చిమార్ధగోళం
డి) దక్షిణార్ధగోళం
సమాధానాలు
1.సి 2.డి 3.బి 4. ఎ 5.ఎ 6.డి 7. బి 8. ఎ 9.సి 10. సి 11.ఎ 12.డి 13. సి 14.సి 15.ఎ