Children Stories | ఇనామిస్త ఏం కావాల్నో చెప్పమంటే.. జాలరాయన అడిగిన కోరిక విని పరేషానైన రాజుగారు!
Children Stories |“ఇనాం ఏం గావాల్నో జెప్పు! ఏదంటె అదిత్త!” అంట అన్నడు. దానికి జాలరాయినె.. “రాజా! నాకు రెండునూర్ల కొరడదెబ్బల ఇనాం గావాలె!” అంట కోరుకున్నడు. పరేషానైన రాజు.. “అరె! నీకేమన్న పిసనా, దత్రమా! ఇనాం గోరుకొమ్మంటె దెబ్బలు గావాలంటున్నవు” అంట అడిగిండు.
Children Stories | ఎన్కట ఒక దేశంల ఒక రాజు హుకుం జేత్తుండు. ఆ రాజుకు శీటికి – మాటికి, అయిందానికి – కాందానికి దావత్లు ఇచ్చుడంటె మస్తు ఇష్టముంటుండె. గట్లనె ఒకపారి దోస్తులను, సుట్టాలను దావత్కు రమ్మని విలిశిండు. అది ముర్గశిర కార్తె యాల్ల. బంతి భోజనంల శాపల కూర వెట్టాలనిపిచ్చింది. ఇగ ఆల్శం గాకుంట మంచిమంచి శాపలు దెమ్మని ఒక జాలరాయినెకు మతులావు వంపిచ్చిండు. తెల్లారంగనే ఆయినె బుట్టి నిండ మంచిమంచి కొర్రమట్టలు వట్టుకొని కోటకాడికి వోయిండు. రాజు హుకూమాయె.. మరి! రాజు శాపలు దెమ్మన్న ముచ్చట గురించి కోట కావలి ఉన్నోళ్లకు అప్పటిదాంక మత్లావు అందలే. జాలరాయినె శాపలు వట్టుకొని వోంగనే.. అందర్లెక్కనే కోటల అమ్ముకోను అచ్చిండని పెద్దర్వాజ కాడ అపిండ్రు.
ఆడు జెప్పేది ఇనకుంటనే.. “ఇగో! ఈ శాపలు అమ్మంగ అచ్చిన పైసలల్ల మాగ్గూడ పాలియ్యాలె! గట్లయితెనే లోపలికి వోనిత్తం!” అంట షర్తు వెట్టిండ్రు. అందుకు జాలరాయినె సరేన్నడు. ఇంకో దర్వాజ కాడికి వోంగనే.. ఆడ గూడ గట్లనే అయ్యింది. ఆడ గూడ “సరే!” అన్నడు జాలరాయినె. ఆఖరికి రాజు తానకు వోయి, శాపల బుట్టలిచ్చిండు. సోరసోర కొర్రమట్టలు జూశి రాజు మస్తు ఖుషీ అయ్యిండు. అప్పటిదాకా అసోంటి శాపలను రాజు సూడలేదు గదా.. తల్వనన్న తల్వలేదు! ఆయినె దిల్ ఖుషీ అయ్యింది. “ఇనాం ఏం గావాల్నో జెప్పు! ఏదంటె అదిత్త!” అంట అన్నడు. దానికి జాలరాయినె.. “రాజా! నాకు రెండునూర్ల కొరడదెబ్బల ఇనాం గావాలె!” అంట కోరుకున్నడు. పరేషానైన రాజు.. “అరె! నీకేమన్న పిసనా, దత్రమా! ఇనాం గోరుకొమ్మంటె దెబ్బలు గావాలంటున్నవు” అంట అడిగిండు. గప్పుడు జాలరాయినె.. “నేను లోపలికచ్చేందుకు మీ కోట దర్వాజ దగ్గర కావలున్నోళ్లకు.. ‘అచ్చిందాంట్ల పాలిత్త!’ అంట జెప్పిన. నాకు రెండునూర్ల కొరడ దెబ్బల ఇనామియ్యిండ్రి. ఆళ్లకు నూరు నూరు పంచుత!” అంట అసలు ముచ్చట జెప్పిండు. గప్పుడు రాజుకు కోటల జరుగుతున్న అసలు ముచ్చట ఎర్కయింది. గా ముచ్చట కుల్లం కుల్లం జేశిన జాలరాయినెకు రెండు నూర్లు ఇనామిచ్చిండు. ఆయినె అడిగినట్లే.. కావలోల్లకు కొరడా దెబ్బలతోని సన్మానం జేయించిండు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Strories | బీర్బల్ చెప్పిన ఆ ఒక్క మాటతో సొంత అల్లుణ్నే జైల్లో వేసిన అక్బర్.. పూర్తి కథ వింటే నవ్వాగదు!!
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

