Children Stories | గాడిదకు గడ్డం గొరుగుమంటే తప్పయ్యిందని శెంపలేసుకున్న సాలుమాన్.. బీర్బల్ ముందే ఏషాలేస్తే అట్నే ఉంటది!
Children Stories | పిల్లలూ! ఇగో మీకు అకుబర్, బీరుబల్ కతలు ఎరుకనే గదా! గమ్మతి గమ్మతిగుంటయి.. మస్తు మంచిగుంటయి గూడ! గసొంటి కతనే ఒకటి ఇనుండ్రి.. సదువుండ్రి! ఎన్కట అకుబర్ చక్రవర్తికి ఒకాయినె గడ్డాలు, మీసాలు, ఎంటికెలు తీశెతందుకు ఉంటుండె. ఆయినె పేరు సాలుమాన్.
Children Stories | పిల్లలూ! ఇగో మీకు అకుబర్, బీరుబల్ కతలు ఎరుకనే గదా! గమ్మతి గమ్మతిగుంటయి.. మస్తు మంచిగుంటయి గూడ! గసొంటి కతనే ఒకటి ఇనుండ్రి.. సదువుండ్రి! ఎన్కట అకుబర్ చక్రవర్తికి ఒకాయినె గడ్డాలు, మీసాలు, ఎంటికెలు తీశెతందుకు ఉంటుండె. ఆయినె పేరు సాలుమాన్. చక్రవర్తికి కటింగు జేత్తడాయె.. కండ్లు నెత్తిమీద ఉంటుండె. ఆల్ల ఆడకట్టుకే కట్టెలు గొట్టి అమ్ముకునే ఒకాయినె ఉంటుండె. రోజు కొన్ని కట్టెలు గొట్టి, అవి మోపులు గట్టి.. గాడిది మీద పెట్టి తిరుక్కుంట తిరుక్కుంట అమ్ముతుండె.
ఒకపారి పొద్దుగాల్నే సాలుమాన్కు కట్టెలు అక్కరవడి ఈనె తానికివోయి, గాడిది మీదున్న మోపును సూయిచ్చుకుంట.. “ఎంత?” అంట అడిగిండు. “అయిదు ఎండి బిల్లలు!” అంట జెప్పిండు కట్టెలమ్మెటాయినె. ఆడ ఉండెటోళ్లందరికీ ఇనిపిచ్చెటట్టు సాలుమాను మల్ల గట్టిగ.. “గాడిది మోపు అయిదు ఎండి బిల్లలు గదా!” అంట అడిగిండు. “అవును!” అన్నడు కట్టెలాయినె. అయిదు ఎండి బిల్లలిచ్చి.. కట్టెలతోని గాడిదిని గూడ తోల్కపోవట్టిండు సాలుమాన్. “అగో.. గాడిదిని ఎటు దోల్క పోతున్నవు!?” అంట అడిగేటాల్లకు.. “గాడిది, కట్టెలు అయిదు ఎండి బిల్లలంటివి. నేనిచ్చిన.. గాడిది నాదే!” అంట రుబాబుతోని గుంజుకొని పోయిండు సాలుమాన్. లబోదిబో మొత్తుకొని పెద్దమనుషుల తానికివోయి జెప్పుకొన్నడు కట్టెలాయినె. అకుబర్ దగ్గర పని జేత్తడాయె! ఆల్లుగూడ సాలుమాన్దే నాయం అన్నరు.
ఆఖరుకు బీరుబల్ తానికివోయి.. పిర్యాదయిండు. ముచ్చటంత ఇన్నంక కట్టెలాయినెకు శెవుల ఉపాయం జెప్పిండు బీరుబల్. ఆరం రోజులయినంక కట్టెలాయినె సాలుమాన్ తానికివోయి.. “నా దోస్తుకు గడ్డం జెయ్యాలె! ఎంతంటె అంత ఇత్త!” అంట ఆశవెట్టిండు. పైసలాశకు ఆడు “అట్లనే!” అన్నడు. గాడిదిని సూయించి గడ్డం గొరుగుమన్నడు కట్టెలాయినె. “గాడిదికి గడ్డం జెయ్య!” అన్నడు సాలుమాన్. “ముందుగాల ఒప్పుకొన్నవ్ గదా! గడ్డం గొరుగాల్సిందే!” అన్నడు కట్టెలాయినె. “నీను నీ దోస్తుకు గడ్డం దీత్తనన్న! గాడిది నీ దోస్తు ఎట్లయితది?” అంట అడిగిండు సాలుమాన్. అంతట్లకే ఆడికి బీరుబల్ అచ్చిండు. ముచ్చటంత ఇనీ.. “నువ్వు అయిదు ఎండి బిల్లలకు గాడిదితోని గలిపి కట్టెలు కొన్నప్పుడు.. గాడిది ఈనె దోస్తు ఎందుకు గావద్దు!?’ అంట అన్నడు. తప్పు దెల్సుకున్న సాలుమాన్.. శెంపలేసుకొని కట్టెలాయినెకు గాడిదిని వాపసిచ్చిండు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది
Children Stories | చెట్టుకు గుర్రం పుడితే.. చేపలు చెట్టెక్కినయ్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

