Children Stories | ఎన్కట ఒక రాజు ఉండేటోడు. ఆయినెకు అయిందానికి, కాందానికి ఇరాం లేకుంట ఇనాంలిచ్చుడు పిస ఉంటుండె. మోక దొరికితె సాలు సబలున్న చప్రాసికెల్లి జాగిద్దారు దాంక.. ఎవ్వలు ఊకుండెటోల్లు గాదు. దొరికిన కాడికి బరుకుదురు. పాపం.. ఆపెతందుకు మంత్రి మాలెస్క కోశిష్ జేత్తుండె.. ఒక్కోపారి యాట్టకస్తుండె. ఒకసారి రాజు కొంతమందితోని అట్లట్ల తిరిగద్దమని అడివిలకు వోయిండు. తిరుగుతుండంగ ఒక శెట్టుమీన ఆయినెకు ఒక కొత్త పచ్చి గనవడ్డది. ఎంటనే సిపాయిలకు జెప్పి.. దాన్ని వట్టిచ్చి తెప్పిచ్చుకున్నడు. అది కొత్తగ గనవడవట్టె.. దాని పేరు కోసం అందర్ని ఇచారం జేసిండు. ఎవ్వలు జెప్పలేదు.
ఆయినె కత ఎర్కనేగదా! ఆండ్లకెల్లి ఒకడచ్చి.. “రాజా! కొత్తది గద.. దాని పేరు దాన్నే అడుగుతె మంచిగుంటది” అంట వంగివంగి దండాలు వెట్టిండు. “మస్తు జెప్పినవ్!” అంట చెయ్యికున్న బంగారు కంకణం దీసి.. ఆనికి ఇనామిచ్చిండు రాజు. అటెన్క.. “నీ పేరేంటిదంట?” అంట పచ్చిని అడిగిండు. అది సప్పుడు జెయ్యలె. అంతట్లకే ఇంకో ఇకమతులోడు.. “రాజా! దీనికి చెవులు ఉండయి గద.. గందుకే అది మాట్లాడ్తలేదు. లేకుంటే సర్కార్ విలుత్తె గమ్మునుంటదా?” అంట ఇకిలించుకుంట జెప్పిండు. ‘శభాష్!” అంట మెచ్చుకుని.. ఆనికి ఇంకో చెయ్యికున్న కంకణం ఇచ్చిండు రాజు. గిట్ల పచ్చి మీదికెల్లి ఆడున్నోల్లంత నపరో ముచ్చట జెప్పి.. దొరికిన కాడికి బరుక వట్టిండ్రు. ఇగ ఇట్నే ఇడిసివెడ్తె.. పెయ్యిమీద బట్టగూడ మిగులదని మంత్రి ఆలోచన జేసిండు. ఆ పచ్చిని ఇడిసి పెట్టుమని సిపాయికి ఇశార జేశిండు. సిపాయి ఇడిసెటాళ్లకు.. అది తుర్రుమంట ఎగిరిపేయింది. “అయ్యో!” అంట రాజు బాద వడ్తుంటే, మంత్రి సముదాయించుకుంట.. “రాజా! అది మాట్లాడ్తలేదు. దానికి పేరు లేదు. మీదికెల్లి హుజూరైన మీ మాటనే ఇంటలేదు. ఇసొంటి పాగల్ పచ్చి మనకెందుకు? పోవుడే నయ్యం” అన్నడు. “శభాష్! మంత్రి.. మంచిగ చెప్పినవు. అది మనకెందుకు?” అంట మంత్రి ఈపుల గొట్టి.. అన్ని వోంగ మిగిలిన బంగారి మొల్తాడును మంత్రికి ఇనాం ఇచ్చిండు. మంత్రికి ఏం జెయ్యాల్నో సమజ్గాక.. మొల్తాడును తీస్కోని దండం బెట్టిండు.
పత్తిపాక మోహన్
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ