Children Stories | అప్పు అడిగితే కాళ్లరిగేలా తిప్పించుకుంటాడా? దెబ్బకు దెబ్బ తీసిన నర్సయ్య కథ ఇదీ!
Children Stories | ఒక ఊళ్లె ఒక అప్పులిచ్చేటాయినె ఉంటుండె. ఆయినె పేరు సుబ్బయ్య. మంచికో - శెడ్డకో.. ఆపతికో - సంపతికో.. ఆ ఊళ్లె ఆయినె తాన అప్పు దీస్కోక తప్పకపోతుండె. అందరు ఆయినె తాన పైసలు దీస్కోని పరేషాన్ అయినోళ్లే! అదే ఊళ్లె ఉన్న నర్సయ్య మాత్రం.. ఎన్నడు సుబ్బయ్య తానకు శేపోయి అప్పు దీస్కోలే.
Children Stories | ఒక ఊళ్లె ఒక అప్పులిచ్చేటాయినె ఉంటుండె. ఆయినె పేరు సుబ్బయ్య. మంచికో – శెడ్డకో.. ఆపతికో – సంపతికో.. ఆ ఊళ్లె ఆయినె తాన అప్పు దీస్కోక తప్పకపోతుండె. అందరు ఆయినె తాన పైసలు దీస్కోని పరేషాన్ అయినోళ్లే! అదే ఊళ్లె ఉన్న నర్సయ్య మాత్రం.. ఎన్నడు సుబ్బయ్య తానకు శేపోయి అప్పు దీస్కోలే. ‘ఈడొక్కడే నా పాలిన వల్లే!’ అంట మెరమెరగుండేది సుబ్బయ్యకు. అన్ని దినాలు ఒక్క తీర్గ ఉండయి గాదుల్ల. ఓపారి నర్సయ్యకు పైసల అక్కర కుత్కెల కాడికి అచ్చింది. గచ్చంత్రం లేక సుబ్బయ్య తానకు శేపోయి కోసం బోయిండు.
మిగిలినొక్కడు గూడ తన గల్మలకు అచ్చేటాల్లకు.. మస్తు ఖుషీ అయిండు సుబ్బయ్య. అయితె.. తన కుతి దీరేదాంక నర్సయ్యను సతాయించి సంబుర వడుదామని ఇకమతు జేశిండు. రేపు – మాపు అనుకుంట.. మాలెస్క ఆరానికెక్వ రోజులు ఇంటి సుట్టు తింపుకొని, అడ్డికి పైసలిచ్చిండు. గీ కతంత సుబ్బయ్య పక్కింట్లున్న నారాయణ సూడవట్టిండు. నర్సయ్యను వడివోశినట్టు తిప్పిచ్చుకునుడు జూశి.. “సుబ్బయ్య గంత ఇజ్జత్ తీశినట్టుగ జేశినా.. ఎందుకని ఊకున్నవు? పైసలెందుకు శేపోయి దీసుకున్నవు?” అంట అడిగిండు. నర్సయ్య నవ్వుకుంట.. “అవుబావా! సుబ్బయ్య అప్పిచ్చెతందుకు నన్ను ఆరం రోజులు తిప్పిచ్చిండు. దెబ్బకు దెబ్బ గొట్టుడు నాగ్గూడ ఎర్కనే! పైసలు ఆపసిచ్చేది నేనే గదనే! నేను గట్లనే నాలుగైదు నెల్లు దింపుకొని ఇస్త! నువ్వే సూత్తవు గద కత!” అంట నవ్వుకుంట వోయిండు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | గాలిమేడలు సూడాలని ఉందని అక్బర్ అడిగితే.. బీర్బల్ భలే తెలిసొచ్చేలా చేశాడు!
Children Stories | తెలివైనోడికి పెద్దపులి ఎదురొస్తే.. ఉరికిచ్చి ఉరికిచ్చి సచ్చేటట్టు చేసిండు
Children Stories | ఎవలైతేంది అని మేకపిల్లను ఆంబుక్క పెట్టిన పెద్దపులి కథ ఇదీ!
Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

