ENG vs USA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) బౌలర్లు అదరగొట్టారు. పేసర్ క్రిస్ జోర్డాన్(4/10) సంచలన బౌలింగ్‌తో ఆతిథ్య అమెరికాను కుప్పకూల్చాడు. 19వ ఓవర్లో జోర్డాన్ హ్యాట్రిక్ తీసి వారెవ్వా అనిపించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ (2/13) సైతం తిప్పేయడంతో ఆతిథ్య అమెరికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అమెరికా జట్టులో నితీశ్ కుమార్(30), కొరే అండర్సన్(29)లు మాత్రమే పర్వాలేదనిపించారు. దాంతో, యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 115 పరుగులు చేసింది.
టాస్ ఓడిన అమెరికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్టీవెన్ టేలర్(12), ఆండ్రిస్ గౌస్(8)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ కుమార్(30), హర్మీత్ సింగ్(21)లు ఉన్నంత సేపు ధనాధన్ ఆడారు. కానీ, ఆదిల్ రషీద్ గూగ్లీలతో రెండు కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.
CHRIS JORDAN BECOMES THE FIRST TO TAKE A HAT-TRICK FOR ENGLAND IN MEN’S T20Is! 🔥🔥🔥 pic.twitter.com/v62lIA1jOl
— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2024
అయితే.. కొరే అండర్సన్(29) భారీ షాట్లకు సిద్ధమైన వేళ క్రిస్ జోర్డాన్ అతడిని బోల్తా కొట్టించాడు. 19వ ఓవర్లో అతడు హ్యాట్రిక్ తీశాడు. వరుసగా మూడు, నాలుగు, ఐదు బంతుల్లో అలీ ఖాన్(00, నోస్తుశ్(0), నేత్రావల్కర్(0)లను బౌల్డ్ చేశాడు. దాంతో, టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా జోర్డాన్ చరిత్ర సృష్టించాడు. జోర్డాన్ సంచలన బౌలింగ్ కారణంగా అమెరికా ఇన్నింగ్స్ 115 వద్దే ముగిసింది.