చాటోగ్రామ్: బంగ్లాదేశ్తో బ్యాటర్ జకీర్ హసన్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండవ ఇన్నింగ్స్లో జకీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 513 పరగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా.. తాజా సమాచారం ప్రకారం నాలుగవ రోజు 4 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 100 పరుగులు చేసిన జకీర్.. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. జకీర్ 224 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 100 రన్స్ చేశాడు. ఇవాళ తొలి సెషన్లో బంగ్లా ఓపెనర్లు ధీటుగా ఆడారు. ఒక్క వికెట్ పడకుండా చూశారు. కానీ లంచ్ తర్వాత బంగ్లా బ్యాటర్లు పెవిలియన్కు క్యూకట్టారు.
A moment to remember for Zakir Hasan 🤩
He gets a 💯 on his Test debut!#BANvIND | #WTC23 | 📝 https://t.co/ym1utFHoek pic.twitter.com/XE1K2F0q86
— ICC (@ICC) December 17, 2022