సూర్య ప్రతాపం
పొట్టి ప్రపంచకప్ ఫ్రారంభానికి ముందు యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల్లో రాణించిన సూర్య.. టీ20 వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో సత్తాచాటాడు.
- ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ గెలుపు
పెర్త్: పొట్టి ప్రపంచకప్ ఫ్రారంభానికి ముందు యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల్లో రాణించిన సూర్య.. టీ20 వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో సత్తాచాటాడు. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ పోరులో టీమ్ఇండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది.
సూర్యకుమార్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం నమోదు చేసుకోగా.. హార్దిక్ పాండ్యా (27), దీపక్ హుడా (22) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్శ్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మెగాటోర్నీకి ముందు అందరికీ ప్రాక్టీస్ చేసే అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

