హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్లు భవేష్ క్రిషవ్ జోడీ విజేతగా నిలిచింది. శనివారం ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్నీ అండర్-13 బాలుర డబుల్స్ ఫైనల్లో భవేష్, క్రిషవ్ ద్వయం 15-21, 21-18, 21-18తో హర్షవర్ధన్, క్రిష్ణ సెతియా జంటపై అద్భుత విజయం సాధించింది. టైటిల్ విజయంతో జాతీయ టోర్నీకి అర్హత సాధించింది. ప్రత్యర్థికి తొలి గేమ్ చేజార్చుకున్న భవేష్, క్రిషవ్ జోడీ..ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుం.
మరోవైపు బాలుర సింగిల్స్ హర్షవర్ధన్, బాలికల సింగిల్స్ హంసిని, బాలికల డబుల్స్ మాణ్య అగర్వాల్, నిత్య విజగిరి టైటిళ్లు సొంతం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో ఇన్ ప్రిన్సిపల్ కమిషన్ మల్లికార్జున, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంశీధర్, ఆర్ కార్యదర్శి శ్రీనివాస్ శారద గోవర్ధని, చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, కోచ్ నాగరాజు, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.