ఇక్సాన్ (దక్షిణ కొరియా): యువ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కిరణ్.. 21-17, 19-21, 21-17తో చి యు జెన్ (చైనీస్ తైఫీ)ను ఓడించాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ అయిన జెన్ను మట్టికరిపించిన కిరణ్.. క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ టకుమా ఒబయషితో ఢీకొననున్నాడు.