World University Games | న్యూఢిల్లీ: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. శనివారం మొదలైన టోర్నీలో భారత ప్లేయర్లు మూడు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ పసిడి పతకంతో మెరిసింది.
మహిళల 10మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ స్వర్ణం సొంతం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ యశస్విని సింగ్, అబింద్యాతో కలిసి టీమ్‌ఈవెంట్‌లో మనుభాకర్ మరో పసిడిని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 57కిలోల జూడోలో యామిని మౌర్య భారత్‌కు తొలి పతకాన్ని(కాంస్యం) అందించింది. ఆర్చరీలో భారత ప్లేయర్లు ఎనిమిది పతకాల కోసం పోటీపడనుండగా, టీటీలో మహిళల జట్టు 3-1తో జర్మనీపై గెలిచి ముందంజ వేసింది.