ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరుగుతున్న అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ రెజ్లర్లు పతకాల పంట పండించారు. గురువారం రాత్రి జరిగిన పలు మ్యాచ్‌లలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం దక్కించుకున్నారు.
మహిళల 43 కిలోల విభాగంలో రచన.. 3-0తో హువాంగ్ (చైనా)ను మట్టికరిపించగా 65 కిలోల విభాగంలో అశ్విని సైతం 3-0తో ముఖాయో (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేసి పసిడి నెగ్గింది. 57 కిలోల విభాగంలో మోని రజతం గెలవగా 73 కిలోల కేటగిరీలో కాజల్ సైతం సిల్వర్ సాధించింది. 49 కిలోల విభాగంలో కోమల్ వర్మ కాంస్యం గెలిచింది.