ఢిల్లీ : భారత యువ బాక్సర్ జదుమణి సింగ్ ప్రపంచ బాక్సింగ్ కప్‌లో సెమీఫైనల్ చేరాడు. బ్రెజిల్‌లోని ఇగాకులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా పురుషుల 50 కిలోల విభాగంలో బరిలోకి దిగిన జదుమణి క్వార్టర్స్‌లో 3-2తో ఎల్లిస్ ట్రోబ్రిడ్జ్ (బ్రిటన్)ను చిత్తుచేశాడు. జదుమణి సెమీస్ చేరినా మరో ముగ్గురు భారత బాక్సర్లు ఆరంభ బౌట్‌లోనే వెనుదిరిగారు. నరేందర్ (90 కిలోలు), నిఖిల్ దూబే (75 కిలోలు), జుగ్నో (85 కిలోలు) నిరాశపరిచారు.