ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారత యువ అథ్లెట్ హిల్లాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించింది. భూటాన్ వేదికగా జరిగిన దక్షిణాసియా బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో 25 ఏండ్ల యాజిక్ స్వర్ణంతో పాటు రజతం సాధించింది.
ఈ క్రమంలో ఆమె అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన తొలి అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. యాజిక్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెమా ఖండు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసల్లో ముంచెత్తారు.