షాంఘై (చైనా): భారత యువ అథ్లెట్ అవినాశ్ సాబ్లె షాం ఘై డైమండ్ లీగ్‌లో 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం కెకియావొ వేదికగా జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో సాబ్లె.. 8 నిమిషాల 23.85 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు.
16 మంది పాల్గొన్న ఈ పోటీలో సిమె అబ్రహమ్ (ఇథియోపియా) 8 నిమిషాల 07.92 సెకన్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా కెన్యా అథ్లెట్లు సెరెమ్, సిమోన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.