ఢిల్లీ : దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) అండర్-20 చాంపియన్‌షిప్‌లో యువ భారత్ అదరగొట్టింది. మాల్దీవులు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్.. 3-0తో దాయాదిని చిత్తుచేసి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
మూడో నిమిషంలోనే విశాల్ యాదవ్ తొలి గోల్ చేయగా 64వ ని.లో రిషి సింగ్ రెండో గోల్ కొట్టాడు. 84వ ని.లో ప్రశన్ మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని అందించాడు.