సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఓటమితో ఆరంభించాడు. సోమవారం సింగపూర్ వేదికగా మొదలైన ఈ మెగా ఈవెంట్ తొలి గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)దే పైచేయి అయింది.
గంటా 20 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో లిరెన్.. 42 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. నల్లపావులతో బరిలోకి దిగిన అతడి ఖాతాలో ఒక పాయింట్ దక్కింది. మొత్తం 14 గేమ్‌లు ఉండే ఈ టోర్నీలో 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తాడు.