Golden IPhone : ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనం లామినె యమల్ (Lamine Yamal) పేరు వినే ఉంటారు. 17 ఏండ్ల వయసులోనే అదరగొడుతున్న ఈ కుర్రాడు ఈ ఏడాది యూరో చాంపియన్‌షిప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఓ వైపు చదువుకుంటూనే.. సాకర్‌లో రాణిస్తున్న యమల్ తాజాగా మరోసారి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాడు. అందుకు కారణం ఏంటంటే.. అతడు అరుదైన బహుమతి అందుకున్నాడు. అవును. ఏకంగా బంగారు ఐఫోన్ (Golden IPhone) ఈ యువకెరటం చేతుల్లో ధగధగ మెరిసిపోతోంది. ఇంతకూ యమల్‌కు ఆ గోల్డెన్ ఐ ఫోన్ ఎవరిచ్చారు? దాని ధర ఎంతంటే…?
చిన్నవయసులోనే స్టార్డమ్ సంపాదించుకున్న యమల్ స్పెయిన్‌లో మస్త్ పాపులర్. అందుకని ఆ కుర్రాడిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీనియర్ ఆటగాడు రఫిన్హా (Rafinha) మరచిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకని బాగా ఆలోచించి అతడికి స్వచ్ఛమైన బంగారంతో తయారైన ఐ ఫోన్‌ను యమల్‌కు గిఫ్ట్‌గా అందించాడు. ప్రతిష్ఠాత్మక ‘ది బాలన్ డి ఓర్’ అవార్డుల వేడుక అనంతరం రఫిన్హా తాను తీసుకొచ్చిన పసిడి ఐఫోన్‌ను యమల్‌కు ఇచ్చాడు.
Lamine Yamal received an iPhone from ‘i Design gold’😍 pic.twitter.com/7d2osOYROq
— Lamine Yamal Xtra (@Yamal_Xtra) November 2, 2024
ఇంతకూ ఈ బంగారు ఐ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా.. రూ.10 లక్షలు. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దానిపై యమల్ పేరుతో పాటు అతడి జెర్సీ నంబర్ కూడా ముద్రించి ఉంది. ది బాలన్ డి ఓర్ అవార్డుల కార్యక్రమంలో యమల్ కోపా ట్రోఫీ విజేతగా నిలిచాడు. మైదానంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 21 ఏండ్లలోపు ఫుట్‌బాలర్‌కు ఏటా కోపా ట్రోఫీ ఇస్తారు.