కొలంబో: ఆసియాకప్‌లో శ్రీలంకతో కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు ముం దు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ బౌలర్ నసీమ్షా ఆసియాకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాక్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. గాయపడ్డ నసీమ్ స్థానాన్ని జమాన్ఖాన్ భర్తీ చేస్తాడని మోర్కెల్ తెలిపాడు.
టోర్నీలో ప్రస్తుతం ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లతో కొనసాగుతున్న పాక్, లంక..ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తమ ఆఖరి సూపర్-4 మ్యాచ్‌లో తప్పక గెలువాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కాగా వ్యక్తిగత కారణాలతో శుక్రవారం భారత్‌తో మ్యాచ్‌కు బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ రహీం దూరమయ్యాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో చూసేందుకు రహీమ్..స్వదేశానికి బయల్దేరి వెళ్లనున్నాడు.